రైతులు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:14 AM
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేస్తున్న నేపథ్యం లో రైతులు అప్రమ్తంగా ఉండాలని....
ప్రత్నామ్నాయ పంటలు వేయాలి: తుమ్మల
హైదరాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేస్తున్న నేపథ్యం లో రైతులు అప్రమ్తంగా ఉండాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. విపత్తులు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని, ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని పిలుపునిచ్చారు. గురువారం సచివాలయంలో వ్యవసాయ, ఉద్యానశాఖలపై సమీక్ష నిర్వహించారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ఈనెల 6, 8, 10 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి రైతులకు అవగాహన కలిగించాలని సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఉపగ్రహ చిత్రాలు సేకరించినట్లే.. రాష్ట్రవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత నివేదికలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. కాగా, కోహెడలో రూ. 2,284.32 కోట్లతో నిర్మించనున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్‌కు ఈనెల ఆరో తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు.