Share News

డయాలసిస్‌ బాధితులకు చేయూత పెన్షన్లు

ABN , Publish Date - May 23 , 2026 | 04:55 AM

రాష్ట్రంలోని కొత్తగా మరో 2,356 మంది డయాలసిస్‌ బాధితులకు చేయూత పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఫైల్‌పై మంత్రి సీతక్క శుక్రవారం ...

డయాలసిస్‌ బాధితులకు చేయూత పెన్షన్లు

  • కొత్తగా 2,356 మందికి అవకాశం: మంత్రి సీతక్క

హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కొత్తగా మరో 2,356 మంది డయాలసిస్‌ బాధితులకు చేయూత పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ఫైల్‌పై మంత్రి సీతక్క శుక్రవారం సంతకం చేశారు. కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు వచ్చే నెల నుంచే రూ.2,016 పెన్షన్‌ అందనుంది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 4,710 మందికి డయాలసిస్‌ బాధితులకు పెన్షన్లు అందించగా.. తాజా మంజూరుతో ఈ సంఖ్య మరింత పెరిగింది. కాగా, ప్రస్తుతం పరిశీలనలో ఉన్న మరో 488 దరఖాస్తులను కూడా త్వరలోనే పరిష్కరించి, అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇస్తామని అధికారులు తెలిపారు. తరచూ ఆస్పత్రులకు తిరగడం, మందుల ఖర్చులు, జీవనోపాధి కోల్పోవడం వంటి సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు రూ.2,016 పెన్షన్‌ ఆర్థికంగా ఊరటనిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. కాగా, పీఎంజీఎ్‌సవై కింద రాష్ట్రానికి నూరు శాతం నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి అతిథి సింగ్‌, వివిధ రాష్ట్రాల అధికారులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. గిరిజన గూడేలకు మైదాన ప్రాంతాలతో అనుసంధానాన్ని పెంచేలా మరిన్ని రహదారులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు అతిథి సింగ్‌ సానుకూలంగా స్పందించారు.

Updated Date - May 23 , 2026 | 04:55 AM