ప్రతీ గ్రామానికి టీ-ఫైబర్ నెట్
ABN , Publish Date - May 28 , 2026 | 03:39 AM
రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ఇంటికి హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం టీ-ఫైబర్ ప్రాజెక్టు వేగవంతంపై దృష్టి సారించింది.
అమెండెడ్ భారత్‌నెట్ కార్యక్రమం కింద అమలు.. రింగ్ ఆర్కిటెక్చర్ విధానంతో నిరంతర సేవలు
కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సీఎం వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, మే 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ఇంటికి హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం టీ-ఫైబర్ ప్రాజెక్టు వేగవంతంపై దృష్టి సారించింది. అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ఏబీపీ) కింద ఈ ప్రాజెక్టు అమలు చేయాలని అనుకుంటుంది. ఇందుకు సంబంధించి కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సహా ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏబీపీ అమలు ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన అంశాలను కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకువెళ్లారు. ముఖ్యంగా కేంద్రంతో ఒప్పందాన్ని త్వరగా కుదుర్చుకోవడం, పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదల వేగవంతంపై మాట్లాడారు. అలాగే మండలం నుంచి గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్న రింగ్ నెట్‌వర్క్ ఆస్తులను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేేస విషయంలో స్పష్టమైన విధానం అవసరమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి సింధియా రాష్ర్టానికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఈ ప్రాజెక్టులో రింగ్ ఆర్కిటెక్చర్ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఒక మార్గంలో అంతరాయం ఏర్పడినా ప్రత్యామ్నాయ మార్గం ద్వారా ేసవలు నిరంతరం కొనసాగించేలా వ్యవస్థను రూపుదిద్దుతున్నారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కూడా నిరంతర హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ేసవలు అందుబాటులోకి రానున్నాయి. మొదటి దశలో ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో నెట్‌వర్క్ దెబ్బతిన్న 3,089 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ పునరుద్థరణ చేపట్టనున్నారు.
ఈ క్రమంలో టీ-ఫైబర్ అమలుకు స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. టీఫైబర్ ప్రాజెక్ట్ విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇప్పటివరకు రూ.3721.60 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్రం పలు అంశాలపై సూచనలు, అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. రాష్ట్రం కేంద్రానికి పలు విజ్ఞప్తులు చేసినట్లు తెలుస్తోంది. అందులో బీఎ్‌సఎన్‌ఎల్ పెండింగ్ బిల్లులు రూ. 121 కోట్లుండగా.. రూ.20 కోట్లను విడుదల చేసింది. మరొక రూ.20 కోట్లు త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. బారత్ నెట్ రెండో దశకు సంబంధించి రూ. 204 కోట్ల నిధుల విడుదల వారంలోపు జరుగుతుందని కేంద్రం స్పష్టం చేసినట్లు తెలిసింది. కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ, ఏబీపీ మార్గదర్శకాల ప్రకారం రూ.997.17 కోట్ల విలువైన రింగ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఆస్తులు డిజిటల్ భారత్ నిధికి ఉన్నది ఉన్నట్లు బదిలీ చేయాలి. అయితే ఈ ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం రుణం తీసుకుని నిర్మించిందని, ఈ మొత్తాన్ని రాష్ట్రానికి తిరిగి చెల్లించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలకు సంబంధించిన రూ.260.94 కోట్లను విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు సమాచారం.
రాజాసాబ్.. రెడ్డి సాబ్..!!
వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య మధ్య సరదా సంభాషణ జరిగింది. కాన్ఫరెన్స్ ప్రారంభమవగానే..రేవంత్ మాట్లాడుతూ.. ‘‘రాజాసాబ్.. స్మార్ట్ దికరాయె ఆప్’’ (స్మార్ట్‌గా కనిపిస్తున్నారు) అని సరదాగా అన్నారు. ఇందుకు స్పందించిన కేంద్రమంత్రి సింథియా ‘‘హా.. రోజు రన్నింగ్ చేస్తా’’నంటూనే.. ‘ రెడ్డి సాబ్... ‘ఆప్ బి ఫిట్ దికరాయె’’ (మీరు కూడా ఫిట్‌గా ఉన్నారు) అని నవ్వుతూ అన్నారని తెలిసింది
ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు : సీఎం రేవంత్
త్యాగనిరతి, దైవభక్తికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ (ఈద్ ఉల్ అజ్హా) పండుగ సందర్భంగా ముస్లింలకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం చేయడానికి సిద్ధపడిన గొప్ప సంఘటనను స్మరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ముసిం్లలు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని సీఎం గుర్తుచేశారు. బక్రీద్ పండుగ మనిషికి త్యాగం, దాతృత్వం, విశ్వాసం, మానవత్వం వంటి గొప్ప విలువలను గురు ్తచేస్తుందని అన్నారు. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా దేవుడిపై నమ్మకంతో సన్మార్గంలో ముందుకు సాగాలనే సందేశాన్ని బక్రీద్ అందిస్తోందని తెలిపారు. తమకు ఉన్నదాంట్లో కొంతైనా అవసరమైన వారికి పంచిపెట్టడంకన్నా గొప్ప దానం మరొకటి లేదనే స్ఫూర్తిని బక్రీద్ చాటిచెబుతోందని పేర్కొన్నారు.