Share News

2047 నాటికి రాష్ట్రాన్ని నం.1 చేస్తాం: సీఎస్‌

ABN , Publish Date - Apr 03 , 2026 | 04:55 AM

2047-విజన్‌తో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు.

2047 నాటికి రాష్ట్రాన్ని నం.1 చేస్తాం: సీఎస్‌

మహేశ్వరం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): 2047-విజన్‌తో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ ప్రభుత్వ ప్రగతి పాలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక- 99 రోజుల కార్యక్రమం’లో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు కలెక్టర్‌తో కలిసి హాజరైన రామకృష్ణారావు.. రాష్ట్ర గీతాన్ని ఆలపించి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా లబ్ధిదారులకు చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ఈ గ్రామ సభలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా కల్యాణలక్ష్మి చెక్కులు, దివ్యాంగులకు ట్రై స్కూటీలను సీఎస్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

Updated Date - Apr 03 , 2026 | 04:55 AM