అమిత్ షాతో ఈటల రాజేందర్ భేటీ
ABN , Publish Date - Sep 29 , 2026 | 04:03 AM
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్‌పై అనర్హత వేటు, త్వరలో జరగబోయే ఉప ఎన్నికపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఆయనకు వివరించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని షా దృష్టికి తీసుకెళ్లారు. పేదలు, రైతుల భూములను ప్రభుత్వం ‘22ఏ’ నిషేధిత జాబితాలో చేర్చి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న అంశాన్ని వివరించారు. ఈ అంశాలపై అసెంబ్లీలో, ప్రజాక్షేత్రంలో బీజేపీ చేపడుతున్న నిరసన కార్యక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలపై నిర్వహిస్తున్న పోరాటాల సరళిని షాకు ఆయన వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరిట చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలను కూడా ఈటల వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
రోడ్డు తనిఖీలో చెంపదెబ్బ వివాదం! ఢిల్లీ మంత్రి పర్వేష్ వర్మపై కేసు నమోదు
ఎల్‌పీయూలో భయానక రాత్రి.. ఆ రోజు ఏం జరిగింది..?