Share News

kumaram bheem asifabad-తీజ్‌ ఉత్సవం..

ABN , Publish Date - Aug 28 , 2026 | 10:52 PM

గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతీక తీజ్‌. సాంకేతిక యుగంలోనూ గిరిజనులు తమ కట్టుబాట్లు, జీవన విధానాన్ని తప్పకుండా పాటిస్తున్నారు.

kumaram bheem asifabad-తీజ్‌ ఉత్సవం..
గోధుమ బుట్టలతో తరలివెళ్తున్న యువతులు (ఫైల్‌)

- తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు

లింగాపూర్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ప్రతీక తీజ్‌. సాంకేతిక యుగంలోనూ గిరిజనులు తమ కట్టుబాట్లు, జీవన విధానాన్ని తప్పకుండా పాటిస్తున్నారు. లింగాపూర్‌ మండలంలోని బంజార తండాలలైన లింగాపూర్‌, పికాతండా, కొత్తపల్లి, వంకామద్ది, మెతిపట్టార్‌, రామునాయక్‌ తండా, గోపాల్‌పూర్‌, ఫూల్‌సింగ్‌తండా, దంపూర్‌, కిమా నాయక్‌తండా, తదితర తండాలలో శ్రావణం నెల చివరివరకు నిర్వహించే తీజ్‌ సంబరాలు మండలం లో శుక్రవారం ప్రారంభమయ్యాయి.

- బతుకమ్మ తరహాలోనే..

తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ పండుగలాగే తీజ్‌ పండుగను జరుపుకుంటారు. తీజ్‌ అంటే పచ్చని పంట లేదా నారుగా అర్థం వస్తుంది. తీజ్‌ బంజారాల మాతృదేవత మేరామాకు ప్రతిరూ పంగా విశ్వసిస్తారు. బంజారాల సంస్కృతిలో ఏడు గురు మాతృదేవతలు ఉంటారు. వారిలో మేరా పెద్దది. ఆమె పైరు పంటలను రక్షిస్తుందని వర్షాలు కురిసి వేసిన పంటలు పుష్కలంగా పండి ధాన్యం ఇంటికి వస్తుందని భావిస్తారు. పచ్చని నారును మేరమా రూపంగా మ లచి పండుగగా జరుపుకుంటారు.

- నాలుగు దశల్లో పండుగలు..

తొమ్మిది రోజులు నాలుగు దశలుగా పండుగను నిర్వహిస్తారు. మొదటిది బుట్టలలో గోధుమలను చల్లుతారు. దీన్ని తీజ్‌ బోరా యేరో అంటారు. రెండో కడావో దేవతకు నైవేద్యం సమర్పించడం. మూడవది గణ్‌గోర్‌ అంటే మేరామా సేవాలాల్‌ల పెళ్లి. నాలుగ వది గోదుమ నారను చెరువులో వదులుతారు. వేరా యేరోగా పిలుస్తారు. బంజారా యువతులు గోధు మలు కొని సారవంతమైన మట్టిని తీసుకొచ్చి బావి దగ్గర నుంచి శుభ్రమైన నీటిని తెచ్చి పాటలు పాడుకుంటూ గోధుమలను నానబెడుతారు. పెద్దలు తీజ్‌ బుట్టలను తయారు చేసి ఇస్తారు. గోధుమలు నానబెట్టి బాటిని బుట్టల్లో వేసి అమ్మాయిలు నృత్యాలతో పాటలు పాడుతూ వెళుతారు. అమ్మా యిలు గోధుమలు నానబెట్టి బుట్టలు వేసే పనిలో ఉంటే వారి అన్నదమ్ములు మంచె వేస్తారు.

- ఉప్పు కారం లేని ఆహారం

తీజ్‌ బుట్టల తయారీ నుంచి గోధుమ నారును చెరువులో వదిలి వేసే వరకు అమ్మాయిలు ఉప్పు, కారంలేని ఆహారాన్ని భూజిస్తూ దీక్షగా ఉంటారు. బంజారాలు రోజంతా వ్యవసాయపనులు ముగిం చుకొని సాయంత్రం తీజ్‌ దగ్గరకు చేరి పాటలు పాడడం నృత్యాలు చేస్తారు. ఏడోరోజున సేవాలా ల్‌కు శాఖహార నైవేద్యాన్ని సమర్పిస్తే మేరామా దేవ త మాంసహార నైవేద్యాన్ని స్వీకరిస్తుంది. ప్రతి కుటుంబం కొంచం బియ్యం పిండిని దీక్షలో ఉన్న అమ్మాయిలకు పంపిస్తారు. పిండి బెల్లం కలిపి అమ్మాయిలు తీజ్‌దగ్గరే నైవేద్యాన్ని తయారు చేస్తా రు. దీన్ని బుజ్మా లాప్సీ అంటారు. ఈ పదార్థాన్ని నెయ్యితో కలిపి మంటలో వేస్తారు. బియ్యం పిండితో రోట్టెచేసి బెల్లంతో కలిపి ముద్ద చేస్తారు. దీన్ని చుర్మో అంటారు. మేరామా సేవాలాల్‌ పెళ్లి కూడా 9వరోజు ఘనంగా జరుపుతారు. గణ్‌ అంటే భార్యగోర్‌ అంటే భర్త గణ్‌గోర్‌ ఉత్సవంగా జరుపుతారు. సాంప్రదా యంగా అలం కరించి పెళ్లి జరిపిస్తారు. దేవతలకు నైవేద్యం సమర్పించగానే మంచె మీద ఉన్న బుట్టల ను అన్నదమ్ములు తీసుకొని పరుగు తీస్తారు. వారి వెంట అక్కచెల్లెల్లు అన్నద మ్ములు కూడా పరుగు తీస్తారు. బుట్టలోని నారు ఏమీ చెయ్యవద్దని తమకు ఇవ్వమంటూ వేడుకునే కార్యక్రమం నిర్వహిస్తారు. దేవతకు ప్రతిరూపాలైన చిన్న బుట్టలను చిందర వందర చేస్తే శోకభరిత గీతాలను ఆలపిస్తారు. ఇలా పలు విధాలుగా ఉత్సవాన్ని కొనసాగిస్తారు. తొమ్మిదో రోజున గోధుమనారును చెరువులో వదులుతారు.

Updated Date - Aug 28 , 2026 | 10:52 PM