Share News

మేడిగడ్డ బ్యారేజీలో సాంకేతిక పరీక్షలు

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:12 AM

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపుర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీలో నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ....

మేడిగడ్డ బ్యారేజీలో సాంకేతిక పరీక్షలు

  • ఎన్‌డీటీ టెస్టులు నిర్వహించిన పుణెకు చెందిన

  • సీడబ్లూపీఆర్‌ఎస్‌ నిపుణుల బృందం

మహదేవపూర్‌ రూరల్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపుర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీలో నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) సూచించిన విధంగా పుణె కు చెందిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ నిపుణుల బృందం సాంకేతిక పరీక్షలు ప్రారంభించింది. షబ్బీర్‌ నేతృత్వంలోని బృందం గురువారం ఎన్‌డీటీ (నాన్‌ డిస్ట్రక్టీవ్‌ టెస్ట్‌) పరీక్షలు చేపట్టింది. దీని ద్వారా బ్యారేజీ నిర్మాణ నాణ్యత, నీటిని తట్టుకునే శక్తి సామర్థ్యాలను నిపుణులు పరీక్షించనున్నారు. కుంగుబాటుకు గురైన ఏడో బ్లాక్‌తో పాటు మిగతా ఏడు బ్లాకుల్లోనూ వారు పరీక్షలు నిర్వహిస్తారు. మేడిగడ్డ పూర్తయ్యాక అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ పరీక్షలు నిర్వహిస్తారు. వీరి తర్వాత మరో నిపుణుల బృందం ఇతర పరీక్షలను చేపట్టనుంది. ఇలా విడతల వారీగా నిపుణులు పరీక్షలు నిర్వహించనున్నారు.

Updated Date - Jan 23 , 2026 | 04:12 AM