Share News

మేడిగడ్డ పునాదుల పరిశీలనలో సాంకేతిక చిక్కులు

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:52 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కింద నది గర్భానికి సంబంధించిన కచ్చితమైన స్వభావం తెలుసుకునే ప్రక్రి య నీటిపారుదలశాఖకు సవాలుగా మారింది.

మేడిగడ్డ పునాదుల పరిశీలనలో సాంకేతిక చిక్కులు

  • సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ సహాయం కోరిన నీటిపారుదల శాఖ

హైదరాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కింద నది గర్భానికి సంబంధించిన కచ్చితమైన స్వభావం తెలుసుకునే ప్రక్రి య నీటిపారుదలశాఖకు సవాలుగా మారింది. బ్యారేజీ కాజ్‌వే, స్పిల్‌వే భాగాల్లో అవసరమైన బోర్‌హోల్స్‌ వేయడం కొన్ని సాంకేతిక సమస్యలతో సాధ్యం కావడం లేదని తేలిపోయింది. దీంతో భూ భౌతిక (జియో ఫిజికల్‌), భూసాంకేతిక (జియో టెక్నికల్‌) పరీక్షల కోసం పుణేలోని కేంద్ర నీటి, విద్యుత్‌ పరిశోధన కేంద్రం (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) సహాయాన్ని నీటిపారుదల శాఖ అభ్యర్థించింది. ఈ మేర కు రామగుం డం చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివా్‌సరావు గుప్తా గురువారం సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ డైరెక్టర్‌కు లేఖ రాశారు. సలహాలు ఇవ్వడానికి ఒక డ్రిల్లింగ్‌ నిపుణుడిని పంపించాలని లేఖలో ఆయన కోరారు. మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగడానికి కారణాలు తెలుసుకోవాలంటే విధిగా పరీక్షలు చేయాలని జాతీ య ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ సిఫారసు చేసిం ది. పరీక్షలు చేసిన తర్వాతే బ్యారే జీ పునరుద్ధరణ కోసం డిజైన్లు సిద్ధం కానున్నాయి. గతంలోనూ బ్యారేజీల పునాదుల కింద నదీ గర్భాన్ని తెలుసుకోవడానికి బోర్‌హోల్స్‌ వేయగా... ఇసుక, నీళ్లు బయటికి వచ్చాయి. వాస్తవానికి వానాకాలం వచ్చేలోపే పరీక్షలన్నీ పూర్తిచేసి, ఫలితాలను అఫ్రీ ఇండి యా (పునరుద్ధరణ డిజైన్లు సిద్ధం చేసే బాధ్యతను దక్కించుకున్న సంస్థ)కు ఇవ్వాలని నీటిపారుదల శాఖ యోచిస్తోంది.

Updated Date - Mar 13 , 2026 | 04:52 AM