Share News

kumaram bheem asifabad- కన్నీటి కౌలు

ABN , Publish Date - Jun 06 , 2026 | 10:40 PM

వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి. భూముల కౌలు ధరలు సైతం ఇబ్బడిము బ్బడిగా పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అమలు చేసే రైతు సంక్షేమ పథకాలేవి వర్తిం చడం లేదు. పెట్టుబడుల కోసం ప్రైవేట్‌ అప్పులు అధిక వడ్డీలకు తీసుకొచ్చినా పంట దిగుబడలు రాక కౌలు రైతులు పుట్టెడు కష్టాల్లో కొట్టుమిట్టాడు తున్నారు.

kumaram bheem asifabad- కన్నీటి కౌలు
లోగో

- జిల్లాలో 20 వేల మందికి పైగా కౌలు సాగుదారులు

- ప్రభుత్వం కనికరించాలని వినతి

వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి. భూముల కౌలు ధరలు సైతం ఇబ్బడిము బ్బడిగా పెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అమలు చేసే రైతు సంక్షేమ పథకాలేవి వర్తిం చడం లేదు. పెట్టుబడుల కోసం ప్రైవేట్‌ అప్పులు అధిక వడ్డీలకు తీసుకొచ్చినా పంట దిగుబడలు రాక కౌలు రైతులు పుట్టెడు కష్టాల్లో కొట్టుమిట్టాడు తున్నారు.

బెజ్జూరు, జూన 6 (ఆంధ్రజ్యోతి): ఎలాంటి ఆధారం లేని పలువురు మట్టిని నమ్ముకొని భూముల ను కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. వారికి తెలిసిన పని ఒక్కటే. అదే వ్యవసాయం. వారికున్న కొద్దో గొప్పో భూమితో పాటు మరి కొంత భూమిని కౌలు తీసుకొని సాగు చేస్తున్నారు. ప్రకృతి కరుణించి, గిట్టుబాటు ధర బాగుంటే నాలుగు రాళ్లు సంపాధించుకుంటారు. కాని గత ఐదేళ్లుగా ఆ పరిస్థితి కనిపించడం లేదు. త్వరలో వానాకాలం సాగు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో మరో సారి భూములను కౌలుకు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కౌలు వ్యవసాయం వారిని కన్నీరు పెట్టిస్తోంది. భూ యజమానులు కౌలు ధరలను అమాంతం పెంచడం, విత్తన, ఎరువుల ధరలు, కూలీల రేట్లు పెరిగిపో వడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పెట్టుబడి సాయం అందకపోవడంతో వెనుకడుగు వేస్తున్నారు.

- పత్తి, వరి..

జిల్లాలో రైతులు అధికంగా పత్తి, వరి పంటలనే అధికంగా సాగు చేస్తారు. జిల్లాలో పెద్దగా సాగు నీటి ప్రాజెక్టులు లేని కారణంగా వర్షాదారంపై ఆదా రపడి పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలో గత ఏడాది 3,50,417ఎకరాల్లో పత్తి, 55వేల ఎకరాల్లో వరి పంటలు సాగు చేశారు. జిల్లాలో సుమారుగా 20వేల మంది వరకు కౌలు రైతులు ఉన్నారు. వీరంతా అధికంగా పత్తి సాగు చేస్తారు. జిల్లాలో గత రెండు, మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా దిగుబడి రాక నష్టాలను చవిచూస్తున్నా రు. ఒక ఏడాది అతివృష్టితో నష్టపోతే, మరో ఏడాది అనావృష్టితో నష్టపోతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు దెబ్బతీస్తున్నాయి. తొలకరి వానలతో పంటలు విత్తుకున్నా పూత, కాత కు వచ్చే సమయంలో వర్షాలు మొహం చాటేస్తుం డడంతో పెట్టుబడి సైతం రాక అప్పులపాలవుతు న్నారు. జిల్లాలో సిర్పూర్‌ నియోజకవర్గంలోని బెజ్జూరు, కౌటాల, చింతలమానేపల్లి, సిర్పూర్‌(టి) మండలాల పరిదిలో ప్రాణహిత, పెన్‌గంగలు ప్రవహిస్తుండడంతో ఏటా వర్షాకాలంలో వరదల కారణంగా పంటలన్ని నీట మునిగి రైతులు తీవ్రం గా నష్టపోతున్నారు. జిల్ల్లాలో గత ఏడాది ప్రాణహి త వరదల కారణంగా దాదాపు 3వేల ఎకరాలకు పైగా పత్తి, 500ఎకరాల్లో వరి పంటలు నీట మునిగి నష్టపో యారు. వీరికి ప్రభుత్వం ఎలాంటి వరద సాయం ఇవ్వక పోవడంతో నష్టపోయారు.

- ఎకరానికి రూ. 15 వేలపైబడి..

జిల్లాలో కౌలు ఎకరానికి రూ. 15నుంచి 20 వేల వరకు పలుకుతోంది. భూమిని బట్టి రైతులు కౌలు చెల్లిస్తున్నారు. జిల్లాలో పెద్దగా సాగు నీటి ప్రాజె క్టులేమి లేని కారణంగా వర్షాదారంపైనే ఆదారపడి పంటలు సాగు చేస్తున్నారు. వర్షాదారంగా పంటలు పండించే భూములకు ఎకరాకు 10నుంచి 15వేల వరకు చెల్లిస్తున్నారు. పంటలు దిగుబడితో సంబంఽ దం లేకుండా కౌలును చెలిం్లంచాల్సిన పరిస్థితి ఉండటం, పంటలకు మద్దతు ధర లేకపోవడం వంటి ఇబ్బందులతో కౌలు రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ధీంతో పెట్టిన పెట్టుబడులు సైతం రాక అప్పుల పాలవుతున్నారు. మరో ఇరవై రోజుల్లో ఖరీఫ్‌ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సాగు ఖర్చు కోసం కౌలు రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదు. వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి డబ్బులు తీసుకొని సాగు చేస్తున్నా కనీసం పెట్టుబడులు సైతం రాని పరిస్థితులు నెలకొన్నాయి. పంట దిగుబడి రాకున్నా వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న డబ్బులను మాత్రం ఎలాగైనా చెల్లించాల్సిందే.

- అధికారిక గుర్తింపు లేక..

కౌలు రైతులకు ఎక్కడా అధికారిక గుర్తింపు లేక పోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన ప్రతీ పథకానికి వీరు అనర్హులుగా మిగిలి పోతున్నారు. రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంఽఽ దు, రైతు బీమా వంటి పథకాలు వారు పొందలేక పోతున్నారు. 2018లో అప్పటి ప్రభుత్వం రైతుబంఽ దు పథకాన్ని ప్రారంభించి ఎకరాకు రూ.5వేల చొప్పున సంవత్సరానికి రూ.10వేల పెట్టుబడి సాయం అందిస్తోంది. ఇక రైతు ఏ కారణంతోనైనా చనిపోయినా రైతులకు భీమా కింద రూ.5లక్షలు అందజేస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా కిసాన్‌ పథకం ద్వారా పెట్టుబడి సాయంగా రూ.6వేలు అందజేస్తోంది. కనీసం బ్యాంకు నుంచి రుణాలు పొందుదామన్న కూడా పొందలేని పరిస్థితిలో కౌలు రైతులు ఉన్నారు. దీంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద దగ్గర ఎక్కువ వడ్డీకీ రుణాలు తెచ్చుకొని వ్యవసాయం చేస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. గతంలో ప్రభుత్వాలు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తామని హామీ ఇవ్వగా అనంతరం కౌలు రైతుల హామీని నెరవేర్చలేదు. గుర్తింపు కార్డులు వస్తాయని ఆశ పడ్డ రైతులకు కన్నీరే మిగిలింది. ప్రభుత్వాలు మారుతున్నా కౌలు రైతుల తలరా తలు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కౌలుకు వ్యవసాయం చేయడం గగనంగా మారుతోందని కౌలు రైతులు ఆందోళన చెందుతు న్నారు. ఇకనైనా కౌలు రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అందించే పథకాలు తమకూ వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఎలాంటి ఆదేశాలు లేవు..

- నాగరాజు, వ్యవసాయ అధికారి, బెజ్జూరు

కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అందించా లన్న ఆదేశాలు లేవు. అదే విధంగా కౌలు రైతులకు ప్రభుత్వం ఎలాంటి గుర్తింపు కార్డులు మంజూరు చేయలేదు. బ్యాంకుల్లో రుణాలు కూడా కౌలు రైతు లకు అందవు. కౌలు సాగు చేసే రైతులకు ప్రత్యేకం గా ఎలాంటి ప్రభుత్వ పథకాలు అందవు.

Updated Date - Jun 06 , 2026 | 10:40 PM