Share News

kumaram bheem asifabad- విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలి

ABN , Publish Date - Sep 16 , 2026 | 11:20 PM

విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. కాగజ్‌నగర్‌ మండలం గన్నారంలోని తెలంగాణ మైనార్టి సంక్షేమ గురుకుల పాఠశాలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వంటగది, వంట సామాగ్రి, ఉపాధ్యాయుల హాజరు పట్టిక తదితర వాటిని పరిశీలించారు. అనంతరం సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో పఠనా సామర్థ్యాన్ని నిర్వహించి వారికి అర్థమయ్యే రితీలో పాఠాలను బోధించాలన్నారు.

kumaram bheem asifabad- విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలి
విద్యార్థుల పాఠ్యపుస్తకాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కె.హరిత

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధించాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. కాగజ్‌నగర్‌ మండలం గన్నారంలోని తెలంగాణ మైనార్టి సంక్షేమ గురుకుల పాఠశాలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వంటగది, వంట సామాగ్రి, ఉపాధ్యాయుల హాజరు పట్టిక తదితర వాటిని పరిశీలించారు. అనంతరం సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో పఠనా సామర్థ్యాన్ని నిర్వహించి వారికి అర్థమయ్యే రితీలో పాఠాలను బోధించాలన్నారు. విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేట్టు చూడాలన్నారు. గురకుల పరిసరాల పరిశుభ్రంగా ఉండేట్టు తగిన చర్యలు చేపట్టాలన్నారు. అలాగే సిబ్బంది, ఉపాధ్యాలు, అధ్యాపకులు సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలన్నారు. అనంతరం పెద్దవాగును పరిశీలించారు. నిమజ్జన ప్రదేశంల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. వాహనాల రాక పోకలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. అనంతరం పలు సూచనలు, సలహాలను సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ హర్ష చౌదరి, డీఎస్పీ వహిదుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మెరుగైన భవిష్యత్తు అందించాలి

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు మెరుగైన భవిష్యత్తు అందించేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన సమగ్రశిక్ష భారత కృత్రిమ అవయావల తయారీ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు సహయ ఉపకరణాల గుర్తింపు నిర్థారణ శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు చేయూతను అందించలన్నారు. కనుచూపు ఇతర అవయావలు సరిగా పనిచేయని పిల్లలు సరిపడ నడవలేని పిల్లలపట్ల తల్లిదండ్రులు ప్రేమతో వ్యవహరించాలని చెప్పారు. కనుచూపులేని వారు నడవలేనివారు కూడా ఉన్నత రంగాలలో రాణిస్తున్నారని ఐఏఎస్‌ అయ్యారని తెలిపారు. అలింకో సంస్థ సహకారంతో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు సఆయ ఉపకరణాలు అందించడం అభినందనీయమని కొనియాడారు. పిల్లలు ఈ ఉపకరణాలను సక్రమంగా వినియోగించుకొని ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, డీఈవో సచ్చిదానందచారి, వైద్యులు, అలింకో సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2026 | 11:20 PM