Share News

kumaram bheem asifabad- నల్లబ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయుల నిరసన

ABN , Publish Date - Aug 07 , 2026 | 11:02 PM

ఉపాద్యాయులు, ఉద్యోగులు పెన్షనర్లకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

kumaram bheem asifabad- నల్లబ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయుల నిరసన
నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు

ఆసిఫాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఉపాద్యాయులు, ఉద్యోగులు పెన్షనర్లకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమస్యల పరిష్కరానికి ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితీ ఆధ్వర్యంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈనెల 12,13 తేదీల్లో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తామని అన్నారు. 19న జిల్లా కేంద్రంలో ధర్నా, ర్యాలీ నిర్వహించేలా కార్యాచరణ రూపొదించామని తెలిపారు. 29న హైదరాబాద్‌ ధర్నాచౌక్‌ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేష్‌, బాలకృష్ణ, మహేందర్‌, శంకర్‌, శ్రీధర్‌, యుగందర్‌ తదితరులు పాల్గొన్నారు.

వాంకిడి, (ఆంధ్రజ్యోతి): సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని శుక్రవారం భోజన విరామ సమయంలో టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండో పీఆర్‌సీ, సీపీఎస్‌ విధానాన్ని రద్దు కోసం వెంటనే కార్యాచరణ చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పీఎంశ్రీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం నటరాజ్‌, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2026 | 11:02 PM