Share News

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 13 , 2026 | 11:27 PM

ఉపాధ్యాయుల న్యాయమైన సమస్య లు పరిష్కరించాలని ఉపాధ్యాయ సం ఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) జిల్లా నాయకుడు సీహెచ్‌ వెంకటప్ప ప్రభుత్వాన్ని కోరారు.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
డిప్యూటీ తహసీల్దార్‌ కృష్ణవేణికి వినతి పత్రం అందజేస్తున్న ఉపాధ్యాయులు

- యూఎస్‌పీసీ జిల్లా నాయకుడు సీహెచ్‌ వెంకటప్ప

కోడేరు, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయుల న్యాయమైన సమస్య లు పరిష్కరించాలని ఉపాధ్యాయ సం ఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) జిల్లా నాయకుడు సీహెచ్‌ వెంకటప్ప ప్రభుత్వాన్ని కోరారు. గురువారం స్థాని క తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి, అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అం దజేశారు. ఆయన మాట్లాడుతూ జూలై 1, 2023 సంవత్సరం నుంచి అమలు పరచా ల్సిన పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని, మార్కె ట్‌ ధరల సూచీకి అనుగుణంగా మెరుగైన ఫిట్‌ మెంట్‌తో తెలంగాణ రాష్ట్రంలో 2వ పీఆర్సీ అ మలు చేయాలని, బకాయి మొత్తాలను చెల్లిం చాలని, 6శాతం డీఏ మంజూరు చేయాలని, సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ పునరు ద్ధరించాలని కోరారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రోగ్రేస్సివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యాయులు కిషోర్‌, సేవ్లా, రాజు, ఎల్లయ్య పాల్గొన్నారు.

తహసీల్దార్‌కు వినతి

తెలకపల్లి, (ఆంధ్రజ్యోతి) : యుఎస్‌పీసీ ఇచ్చిన పిలుపు మేరకు దేశల వారి పోరాటంలో భాగంగా గురువారం మండలంలోని తహసీ ల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ విజయ్‌కు మార్‌కు టీఎస్‌యూటీఎఫ్‌ మండల కమిటీ ఆ ధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. సంఘం అధ్యక్షుడు సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ ఉపా ధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించా లని కోరారు. కార్యక్రమంలో నాయకులు చంద్ర మౌళి, శ్రీనివాసులు, రమేష్‌, కొమ్ము రమేష్‌, ఛత్రునాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2026 | 11:27 PM