kumaram bheem asifabad- ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Feb 22 , 2026 | 10:30 PM
అన్ని యజమాన్యాల ఉపాధ్యా యులు, ఉద్యోగులకు హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని సంఘాలతో చర్చించి సమంజసమైన ఫిట్మెంట్ అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ హైస్కూల్‌లో ఆదివారం టీఎస్‌టీయూఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి అధ్యక్షతన జరిగిన జిల్లా ఆఫీసు బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): అన్ని యజమాన్యాల ఉపాధ్యా యులు, ఉద్యోగులకు హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలని, పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని సంఘాలతో చర్చించి సమంజసమైన ఫిట్మెంట్ అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ హైస్కూల్‌లో ఆదివారం టీఎస్‌టీయూఎఫ్ జిల్లా అధ్యక్షురాలు శాంతికుమారి అధ్యక్షతన జరిగిన జిల్లా ఆఫీసు బేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని తప్పు పట్టారు. 2024 మార్చి నుంచి రిటైర్‌మెంట్ అయిన ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని, పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని అన్నారు. డీఏ వాయిదాలను విడుదల చేయాలని కోరారు. నూతన రాష్ట్ర పతి ఉత్తర్వులకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలను రూపొందించి డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈవో తదితర పసర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయడం ద్వారా విద్యాశాఖలో నెలకొన్న సంక్షోభాన్ని నివారించాలని కోరారు. ఆశ్రమ పాఠశాలల సీఆర్టీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కేజీబీవీ, యూఆర్‌ఎస్, సమగ్ర శిక్షణ ఉద్యోగులకు బేసిక్ పే ఇవ్వాలని అన్నారు. గురుకలాల్లో ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. టెట్ మినహాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అర్హత మార్కులను తగ్గించి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఊశన్న, జిల్లా ఉపాధ్యక్షుడు ఇందురావ్, నాయకులు రమేష్, రాజకమలాకర్‌రెడ్డి, దుర్గయ్య, మహిపాల్, రోహిత్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.