Share News

kumaram bheem asifabad- ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ABN , Publish Date - Oct 04 , 2026 | 10:36 PM

ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీఆర్టీటీయూటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆడె ప్రకాష్‌ డిమాండ్‌ చేశారు. స్థానికంగా ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యా యులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. అక్రమ వర్క్‌ అడ్జస్ట్‌మెంట్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

kumaram bheem asifabad- ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
మాట్లాడుతున్న పీఆర్టీయూటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆడె ప్రకాష్‌

కాగజ్‌నగర్‌ టౌన్‌, అక్టోబరు 4 (ఆంద్రజ్యోతి): ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పీఆర్టీటీయూటీఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆడె ప్రకాష్‌ డిమాండ్‌ చేశారు. స్థానికంగా ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యా యులకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. అక్రమ వర్క్‌ అడ్జస్ట్‌మెంట్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సెన్సెస్‌ విధులలో పాల్గొన్న ఉపాధ్యాయులకు 24 ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని చెప్పారు. వేతన సవరణ మంజూరు కోసం అతి త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈనెల 15, 16 తేదీల్లో నల్గొండలో నిర్వహించే రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌, మాజీ జిల్లా అధ్యక్షులు ఏటు కూరి శ్రీనివాస్‌ రావు, గౌరవ అధ్యక్షుడు నరసింహాచారి, జిల్లా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రావణ్‌కుమార్‌, ప్రకాష్‌, జాడి జ్ఞానేష్‌, ఎనగంటి బిక్షపతి, వికాస్‌, సురేష్‌, పురుషోత్తం, తిరుపతి, శివకుమర్‌, గోపాల్‌, మహేందర్‌, తులసిరా, రవీందర్‌, సదానందం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 10:36 PM