పాత పింఛన్ అమలుచేయండి
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:57 AM
పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని, దీనికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర నుంచి ఆర్థిక సహకారం లభించేలా తాము కృషిచేస్తామని బీజేపీకి చెందిన ఉపాధ్యాయ....
విద్యాకమిషన్ సిఫారసులను ప్రభుత్వం తిరస్కరించాలి
సీఎస్‌కు ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్క కొమరయ్య విజ్ఞప్తి
హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని, దీనికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర నుంచి ఆర్థిక సహకారం లభించేలా తాము కృషిచేస్తామని బీజేపీకి చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, మల్క కొమరయ్య పేర్కొన్నారు. 2003 డీఎస్సీ వారికి వెంటనే పాత పింఛను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. గురువారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును వారు కలిసి ఉపాధ్యాయ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యాకమిషన్ ఇటీవలే ముఖ్యమంత్రికి సమర్పించిన నివేదిక ఉపాధ్యాయుల ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉందని, అందులోని సిఫారసులను ప్రభుత్వం తిరస్కరించాలని కోరారు. సీపీఎస్ ఉద్యోగుల డీఏ బకాయిలు చెల్లించాలని, పీఆర్టీ అమలు తర్వాతే ఉపాధ్యాయుల నుంచి ఆరోగ్య కార్డుల కోసం 1.5 శాతం వాటా స్వీకరించాలన్నారు. మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయులకు 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, జీవో 317 బాధిత ఉపాధ్యాయులకు వెంటనే బదిలీలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎస్ పేర్కొన్నారు.