ఉపాధ్యాయుల కొరత
ABN , Publish Date - Nov 04 , 2026 | 11:19 PM
కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామం లోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో అన్ని సబ్జెక్టు లకు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారని మొలచింతల పల్లి గ్రామ యువత ఆవేదన వ్యక్తం చేశారు.
- టీచర్లను నియమించాలని ఎంఈవోకు గ్రామస్థుల వినతి
కొల్లాపూర్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామం లోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో అన్ని సబ్జెక్టు లకు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారని మొలచింతల పల్లి గ్రామ యువత ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలపై గ్రామ యు వత బుధవారం ఎంఈవో ఇమ్మానుయేల్ కు వి నతిపత్రం అందజేశారు. గ్రామంలో ఉన్నత పా ఠశాల 2014వ సంవత్సరంలో ప్రారంభమైనప్ప టి నుంచి ఇప్పటి వరకు ఇంగ్లిష్, హిందీ సబ్జె క్టు టీచర్లు లేకపోవడం వల్ల మారుమూల గ్రా మీణ విద్యార్థులు నాణ్యమైన వి ద్యకు దూరమవుతున్నారు. ఈ సంవత్సరం వర్క్ అడ్జెస్ట్‌మెంట్ లో భాగంగా ఇంగ్లిష్ బోధించే ఉపాధ్యాయున్ని కేటా యించిన ప్పటికీ ఇప్పటి వరకు పాఠశాలలో వారు జాయిన్ కాలేదని తెలిపారు. వర్క్ అడ్జెస్ట్‌మెంట్‌లో భాగంగా పని చేస్తున్న హిందీ టీచర్ కూడా కొందరు టీచర్ యూని యన్ నాయకుల ప్రోద్బలంతో పోవడానికి ప్ర యత్నాలు చేస్తున్నట్లు విద్యార్థుల ద్వారా తమ దృష్టికి వచ్చిందని యువకులు ఎంఈవో దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చు ట్టూ కాంపౌండ్‌వాల్ లేకపోవడం, మరుగు దొడ్లు, టాయిలెట్స్ వసతులు లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదనతో తెలిపారు. అందరూ ఉపాధ్యాయులు పాఠశాలలో పని చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. లేనియెడల విద్యా ర్థులతో కలిసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని యువకులు హెచ్చరించారు. జి. శ్రీకాంత్, ఎన్. శివవర్మ, ఎండీ. ఫయాజ్, జి.వినయ్, ఎండీ యజాజ్ వినతిపత్రం ఇచ్చినవారిలో ఉన్నారు.