ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
ABN , Publish Date - Jul 04 , 2026 | 11:32 PM
పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ స మస్యలు పరిష్కరించాలని తెలంగా ణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీ పీయూఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్ కోరారు.
- తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్
కొల్లాపూర్/ అచ్చంపేటటౌన్/ ఉ ప్పునుంతల/ పెంట్లవెల్లి/ లింగాల, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ స మస్యలు పరిష్కరించాలని తెలంగా ణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీ పీయూఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్ కోరారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 4న మండల స్థాయి లో, 14వ తేదీన జిల్లా స్థాయిలో, 24వ రాష్ట్ర స్థా యి ధర్నా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మొదటి విడతలో భాగంగా శనివారం తహసీ ల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహ సీల్దార్ సైదులుకు అందజేశారు. ఆయన మా ట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పీఆర్సీ అ మలు, పెండింగ్ డీఏల ప్రకటన, ఈ కుబేర్‌లో పేరుకుపోయిన బిల్లులకు సత్వరం నిధులు మంజూరు చేయాలని కోరారు. పెన్షనర్లకు అన్ని రకాల పెండింగ్ బిల్లులకు నిధులు మంజూరు చేయాలన్నారు. సీపీఎస్ రద్దు, కేజీబీవీ, మోడ ల్, గురుకుల, ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యా యుల సమస్యల పరిష్కారంతో పాటు పాఠశా లల్లో మౌలిక వసతుల కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘం నా యకులు అరవింద్ రావు, గోవర్ధన్, శివ, రాంగో పాల్ గౌడ్, రమేశ్, శివప్రసాద్, రమేష్ రాథోడ్, సతీశ్‌కుమార్, రామారావు, భద్రు, సాధన, నిర్మల, కవిత పాల్గొన్నారు.
ఫ ఉప్పునుంతలతహసీల్దార్‌కు తపస్ జిల్లా బాధ్యులు జగదీశ్వర్, ప్రభాకర్‌రెడ్డి, మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు వినతిపత్రం అంద జేశారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు రాజేశ్, చంద్రశేఖర్, నాయకులు అశోక్, నర్మద, బుచ్చయ్య, రాజు పాల్గొన్నారు.
ఫ పెంట్లవెల్లిలో టీపీయూఎస్ మండల కమిటీ సభ్యుడు బింగి రాముడు ఆధ్వర్యంలో తహసీల్దార్ భాస్కర్‌కు వినతి పత్రం అందజేశా రు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు నాగయ్య, సాయికృష్ణ, వెంకటేష్ పాల్గొన్నారు.
ఫ కొల్లాపూర్ తహసీల్దార్ మాధవి ద్వారా ముఖ్యమంత్రికి తపస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో తపస్ రాష్ట్ర కా ర్యదర్శి కట్ట నరేందర్‌రెడ్డి, నియోజకవర్గం ఇన్ చార్జి పసుల సతీష్, మండల ప్రధాన కార్యదర్శి నారాయణరెడ్డి, శోభారాణి, గాల్‌రెడ్డి, అనిత, రాధాకృష్ణ, శ్రీదేవి పాల్గొన్నారు.
ఫ లింగాల తహసీల్దార్ కార్యాలయ ఆవర ణలో తహసీల్దార్ వెంకటేష్‌కు టీపీయూఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అం దజేశారు. కార్యక్రమంలో టీపీయూఎస్ మండ ల అధ్యక్షుడు సతీష్‌కుమార్, ప్రధాన కార్యదర్శి రమేష్, జేఏసీ చైర్మన్ వెంకటేశ్వరశర్మ, శ్రీనివాస్ రెడ్డి, ధరంసింగ్, శేఖర్ పాల్గొన్నారు.