Share News

Tata Training to Expand to Polytechnic : పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు టాటా శిక్షణ

ABN , Publish Date - Jan 02 , 2026 | 04:25 AM

ఇప్పటికే పలు ఐటీఐలలో టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ అందిస్తున్న శిక్షణ సత్ఫలితాలను ఇవ్వడంతో ఈ ఏడాది పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ కళాశాలలకు దీనిని విస్తరించాలని విద్యా శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.

Tata Training to Expand to Polytechnic : పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు టాటా శిక్షణ

హైదరాబాద్‌ సిటీ, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): ఇప్పటికే పలు ఐటీఐలలో టాటా టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ అందిస్తున్న శిక్షణ సత్ఫలితాలను ఇవ్వడంతో ఈ ఏడాది పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ కళాశాలలకు దీనిని విస్తరించాలని విద్యా శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. బుధవారం సాంకేతిక విద్యా కమిషనర్‌ కార్యాలయంలో ఇంజనీరింగ్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తున్న యూనివర్సిటీలు, పాలిటెక్నిక్‌లు, ఇంజనీరింగ్‌ తరహా కోర్సులందించే డిగ్రీ కళాశాలల ప్రతినిధులతో టాటా టెక్నాలజీస్‌ నిపుణులు సమావేశమయ్యారు. డిప్లొమా, బీటెక్‌ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకనుగుణంగా నైపుణ్య శిక్షణను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈమేరకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని యూనివర్సిటీలు, పాలిటెక్నిక్‌లు, డిగ్రీ కళాశాలల ప్రతినిధులను విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇదిలా ఉండగా.. నేషనల్‌ అప్రెంటీ్‌సషిప్‌ అండ్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌(నాట్స్‌)కు అన్ని యూనివర్సిటీలు, సాంకేతిక విద్య అందిస్తున్న ఇతర విద్యాసంస్థలు ఎన్‌రోల్‌ కావాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు.

Updated Date - Jan 02 , 2026 | 04:25 AM