పనులను త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Jun 09 , 2026 | 11:31 PM
ప్రభుత్వ పాఠశాలల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అ న్నారు. మంగళవారం పట్టణంలోని రాంనగర్‌లో నిర్మిస్తున్న ప్రాథమిక పాఠశాల, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను పరి శీలించారు.
కలెక్టర్ కుమార్ దీపక్
బెల్లంపల్లి, జూన్ 9 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అ న్నారు. మంగళవారం పట్టణంలోని రాంనగర్‌లో నిర్మిస్తున్న ప్రాథమిక పాఠశాల, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను పరి శీలించారు. పాఠశాలల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసి విద్యా రంగ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సకల సదుపాయాలతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు రుచిక రమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తుందన్నారు. అనంతరం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి భోజన శాల నిర్మా ణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.