Share News

లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయాలి

ABN , Publish Date - May 07 , 2026 | 11:25 PM

మండలం లోని పెద్దపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతు న్న వివిధ పనులను డీఆర్‌డీవో చిన్న ఓబులేష్‌ గురువారం పరిశీలించారు.

లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయాలి
ఉపాఽధి హామీ కూలీలతో మాట్లాడుతున్న డీఆర్‌డీవో చిన్న ఓబులేష్‌

- డీఆర్‌డీవో చిన్న ఓబులేష్‌

తెలకపల్లి, మే 7 (ఆంధ్రజ్యోతి) : మండలం లోని పెద్దపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతు న్న వివిధ పనులను డీఆర్‌డీవో చిన్న ఓబులేష్‌ గురువారం పరిశీలించారు. గ్రామంలో జరుగు తున్న ఫీడర్‌ ఛానల్‌, నర్సరీ, పశువుల పాక ని ర్మాణం, ఈత ప్లాంటేషన్‌ వంటి ఉపాఽధి హామీ పనులను ఆయన పరిశీలించారు. కూలీలతో మాట్లాడి పనుల పురోగతిపై వివరాలు తెలుసు కున్నారు. పనులను తొందరగా ఇచ్చి టార్గెట్‌ ప్ర కారం పూర్తి చేయాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ బుగ్గస్వామి, ఎం పీడీవో శ్రీనివాసులు, ఎంపీవో మల్లేష్‌, టీఏ సత్య నారాయణ, పంచాయతీ కార్యదర్శి రాజు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌, మేట్‌ పాల్గొన్నారు.

కూలీల సంఖ్య పెంచాలి : ఎంపీడీవో

తిమ్మాజిపేట, (ఆంధ్రజ్యోతి) : ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీల సంఖ్య పెంచి, వారికి సరిపోను పను లు కల్పించాలని ఎంపీ డీవో లక్ష్మీదేవి అన్నారు. మండల పరిధిలోని మ రికల్‌ గ్రామ పంచా యతీలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఆమె గురువారం పరి శీలించారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూ లీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. ఎండలు అధికంగా ఉన్నాయని పొద్దున్నే 6 గంటల వరకే ఉపాధి హామీ పనులు చేపట్టే ప్రదేశానికి రావాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో సమావేశ మందిరం లో ఆమె పంచాయతీ కార్యదర్శులతో సమావేశ మయ్యారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల వేగం పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

సమయపాలన పాటించాలి

తిమ్మాజిపేట, (ఆంధ్రజ్యోతి) :ఎండలు తీవ్రం గా ఉన్నందున ఉపాధి హామీ కూలీలు సమయ పాలన పాటించాలని మండల పరిధిలోని గు మ్మకొండ గ్రామ పంచాయతీ పంచాయతీ కా ర్యదర్శి హేమలత అన్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయాన్నే 6గంటల వరకు పనుల ప్రదేశానికి రావాలని అన్నారు.

Updated Date - May 07 , 2026 | 11:25 PM