Share News

తారామతి రిసార్ట్స్‌లో డ్రగ్స్‌ కలకలం

ABN , Publish Date - Apr 05 , 2026 | 06:12 AM

డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈగల్‌’ టీమ్‌ దూకుడుగా వ్యవహరిస్తోంది.

తారామతి రిసార్ట్స్‌లో డ్రగ్స్‌ కలకలం

  • ఈగల్‌ బృందం దాడి.. ఆరుగురికి పాజిటివ్‌

  • వారిలో ఒకరు మహిళ

  • పార్టీలో సినీ జూనియర్‌ ఆర్టిస్టులు కూడా..

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈగల్‌’ టీమ్‌ దూకుడుగా వ్యవహరిస్తోంది. హైదరాబాద్‌లోని గోల్కొండ ప్రాంతంలో పేరొందిన తారామతి రిసార్ట్స్‌లో శనివారం రాత్రి ఈగల్‌ బృందం దాడి చేసింది. ‘జాక్‌ జాన్సన్‌’ పేరిట రిసార్ట్‌లో జరుగుతున్న ఈవెంట్‌లో డ్రగ్స్‌ వినియోగంపై అందిన సమాచారంతో రంగంలోకి దిగింది. సినిమాలో నటించే పలువురు జూనియర్‌ ఆర్టిస్టులు ఈ ఈవెంట్‌కు హాజరైనట్టు తెలిసింది. అయితే, రిసార్ట్‌లో ఉన్నవారిలో 36 మందికి ఈగల్‌ బృందాలు పరీక్షలు చేయగా వారిలో ఓ మహిళ సహా ఆరుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌ అని తేలినట్టు సమాచారం. రిసార్ట్‌లో సోదాలు కొనసాగుతున్నాయి.

Updated Date - Apr 05 , 2026 | 06:16 AM