Share News

కాంగ్రెస్‌వి బట్టేబాజ్‌ మాటలు

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:22 AM

కాంగ్రెస్‌వి బట్టేబాజ్‌ మాటలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట, కోహీర్‌, చిట్కూల్‌ మున్సిపాలిటీల్లో ఆయన ఆదివారం....

కాంగ్రెస్‌వి బట్టేబాజ్‌ మాటలు

  • రేవంత్‌ పాలనలో ఫ్రీ బస్సు తప్ప అంతా తుస్సే: హరీశ్‌

సదాశివపేట/కోహీర్‌/పటాన్‌చెరు రూరల్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌వి బట్టేబాజ్‌ మాటలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట, కోహీర్‌, చిట్కూల్‌ మున్సిపాలిటీల్లో ఆయన ఆదివారం ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్‌ రెండేళ్ల పాలనలో ఒక్క మంచి పనీ చేయలేదని విమర్శించారు. రెండేళ్ల తర్వాత మళ్లీ కేసీఆర్‌ సీఎం అవుతారని, తాను మంత్రిని అవుతానని, అప్పుడు సదాశివపేట అభివృద్ధికి కోరినన్ని నిధులు ఇచ్చే బాధ్యత తనదేన్నారు. రేవంత్‌రెడ్డి పాలనలో ఫ్రీ బస్సు తప్ప మిగిలిన హామీలన్నీ తుస్సేనని ఎద్దేవా చేశారు. తన పాలనలో చేసిందేమీ లేకే సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ తెచ్చిన మాజీ సీఎం కేసీఆర్‌పై విషం చిమ్ముతున్నాడని హరీశ్‌రావు మండిపడ్డారు.

Updated Date - Feb 09 , 2026 | 02:22 AM