డ్రగ్స్ మాఫియాతో రోహిత్‌రెడ్డికి సంబంధాలు
ABN , Publish Date - Mar 19 , 2026 | 04:42 AM
వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి అంతర్‌రాష్ట్ర డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆరోపించారు.
అసెంబ్లీలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆరోపణ
తాండూరు, మార్చి 18(ఆంధ్రజ్యోతి): వికారాబాద్ జిల్లా తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి అంతర్‌రాష్ట్ర డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నాయని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, రోహిత్ రెడ్డి డ్రగ్స్ వినియోగదారుడు మాత్రమే కాదని, ఆయన ఒక డ్రగ్ పెడ్లర్‌గా కూడా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ, ఆంధ్ర, కర్నాటక వంటి రాష్ట్రాల్లో విస్తరించిన డ్రగ్ నెట్‌వర్క్‌తో ఆయనకు సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా దుబాయ్‌లో ప్రముఖ వ్యాపారవేత్త కేదర్ మరణించిన సమయంలో రోహిత్‌రెడ్డి అక్కడే ఉన్నారన్నారు. దీని వెనుక కీలక నేతల హస్తం కూడా ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.