ఆస్పత్రి, ఫంక్షన్ హాల్‌లో 50శాతం రాయితీ!
ABN , Publish Date - Feb 10 , 2026 | 04:26 AM
మునిసిపల్ ఎన్నికల్లో తన అల్లుడిని కౌన్సిలర్‌గా గెలిపిస్తే.. తన ఆస్పత్రి, ఫంక్షన్ హాల్‌లో 50శాతం రాయితీలు ఇస్తానని అభ్యర్థి తరఫున....
తాండూరులో బీఆర్‌ఎస్ అభ్యర్థి మామ ఆఫర్
తాండూరు, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల్లో తన అల్లుడిని కౌన్సిలర్‌గా గెలిపిస్తే.. తన ఆస్పత్రి, ఫంక్షన్ హాల్‌లో 50శాతం రాయితీలు ఇస్తానని అభ్యర్థి తరఫున అతడి మామ బంపర్ ఆఫర్ ఇచ్చారు. తాండూరు పట్టణంలో 13వ వార్డు నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి సురేశ్ నాయక్ మామ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ ఈ మేరకు హామీ ఇచ్చారు. వినాయక ఫంక్షన్ హాల్‌లో 50శాతం, వినాయక ఆస్పత్రిలో 50 శాతం రాయితీలు ఇవ్వడంతోపాటు నర్సింగ్ కళాశాలలో 50శాతం ఫీజు మాఫీ చేస్తామని భరోసా ఇచ్చారు. చదువుకున్న వారికి ఔట్‌సోర్సింగ్‌లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అలాగే, తనను గెలిపిస్తే.. ఆడ పిల్ల పుట్టిన కుటుంబానికి రూ.2,500, ఆడ పిల్ల పెళ్లి చేసే కుటుంబానికి రూ.11వేలు ఆర్థికసాయం చేస్తానని 23వ వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి పరిమళ ప్రకటించారు.