పెద్దపులి ఫామ్‌హౌస్‌లో ఉంది
ABN , Publish Date - May 25 , 2026 | 05:18 AM
పులి వ్యవసాయ క్షేత్రం(ఫామ్ హౌస్)లో పడుకొని ఉంది. మన పెద్ద పులి ఒక్కసారి లేచిందనుకో.. చూసిండ్రు కదా.. మధ్య, మధ్యలో అట్లా వచ్చి కనిపించి పోతేనే భయం భయం....
కేసీఆర్‌ను పులితో పోల్చిన తలసాని
హైదరాబాద్ సిటీ, మే 24 (ఆంధ్రజ్యోతి): ‘పులి వ్యవసాయ క్షేత్రం(ఫామ్ హౌస్)లో పడుకొని ఉంది. మన పెద్ద పులి ఒక్కసారి లేచిందనుకో.. చూసిండ్రు కదా.. మధ్య, మధ్యలో అట్లా వచ్చి కనిపించి పోతేనే భయం భయం’ అంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్‌ను పులితో పోల్చారు. అంబర్‌పేట నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ కేసీఆర్ చరిత్ర, వ్యక్తిత్వం, విజ్ఞానం. ఆలోచనా విధానం రాష్ట్రంలో ఎవరికైనా ఉందా అని ప్రశ్నించారు. చిన్నోడు, పొట్టోడు, పొడుగొడు ఏది పడితే అది మాట్లాడుతున్నరని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యం గా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ఒక్క బతుకమ్మ కుంట అభివృద్ధి చేసి ఎంతో ప్రచారం చేసుకుంటున్నారని, 1400 చెరువులు అభివృద్ధి చేసినా తాము ఏనాడూ ప్రచారం చేసుకోలేదన్నారు. పార్టీ కార్యక్రమాలు చేయకుండా తప్పించుకుంటున్న నాయకుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన కేటీఆర్‌ను కోరారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసులు ఉపసంహరించుకోవాలి
ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీ సర్కార్‌ను బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను బేషరతుగా ఉప సంహరించుకుంటున్నట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రకటించినప్పటికీ.. కక్షపూరిత ధోరణితో కేసులు నమోదు చేసి వేధించడం సరికాదంటూ ఏపీ సీఎంఓ, డిప్యూటీ సీఎంఓలను ట్యాగ్‌చేస్తూ.. ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు.