Share News

కేసీఆర్‌పై కక్ష సాధింపు: తలసాని

ABN , Publish Date - Feb 01 , 2026 | 06:13 AM

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ప్రపంచమంతా చూస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.

కేసీఆర్‌పై కక్ష సాధింపు: తలసాని

  • నేడు నిరసనలకు బీఆర్‌ఎస్‌ పిలుపు

హైదరాబాద్‌, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్‌ ప్రభుత్వ కక్షసాధింపు చర్యలను ప్రపంచమంతా చూస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. సర్కస్‌ కంపెనీలా మారిందని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ చట్టాన్ని గౌరవిస్తానని కేసీఆర్‌ చెప్పినా ఎందుకు క్షక్ష సాధిస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌కు సిట్‌ పేరిట నోటీసులివ్వడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. కాగా, ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్‌ఎస్‌ నేతలు పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనాలు, నియోజకవర్గ కేంద్రాల్లో బైక్‌ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

Updated Date - Feb 01 , 2026 | 06:14 AM