kumaram bheem asifabad- శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:08 PM
సిర్పూర్(టి) మండలంలోని వార్డు సభ్యులు శిక్షణను సద్వినియోగం చేసుకుని గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీడీఓ సత్యనారాయణ అన్నారు. సిర్పూర్(టి) మండల కేంద్రంలోని రైతు వేదికలో వార్డు సభ్యులకు ఐదు రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. శి
సిర్పూర్(టి), మార్చి 22 (ఆంధ్రజ్యోతి): సిర్పూర్(టి) మండలంలోని వార్డు సభ్యులు శిక్షణను సద్వినియోగం చేసుకుని గ్రామ పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీడీఓ సత్యనారాయణ అన్నారు. సిర్పూర్(టి) మండల కేంద్రంలోని రైతు వేదికలో వార్డు సభ్యులకు ఐదు రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పంచాయతీల అభివృద్ధికి పాటు పడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ వినోద్‌కుమార్, శిక్షకులు తుకారాం, తిరుపతి, రమేష్, సంతోష్, రఘుకుమార్, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
సిర్పూర్(యు),(ఆంధ్రజ్యోతి):మండలంలోని ఆయా గ్రామ పంచాయితీలకు ఇటివల్ల ఎన్నికైన వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు ప్రారంభించారు.మండల కేంద్రంలో గల రైతు వేధికలో వార్డు సభ్యుల ఐదు రోజు శిక్షణ కార్యక్రమంను ఆదివారం ఎంపిడోవొ రామకృష్ణారావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు సభ్యుల విధులు,2018 పంచాయితీ రాజ్ చట్టంపై ఆవగాహాన కల్పించారు.వార్డు సభ్యులకు వారి విధులతోపాటు నిధులు,భాద్యతలు తదితరు ఆంశాలపై ఆవగాహన కల్పించారు.ఈ అవకాశాన్ని నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు సద్వినియోగించుకోని గ్రామ పంచాయితీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలిని కోరారు. కార్యక్రమంలో ట్రేనీ అధికారులు సతీష్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.