kumaram bheem asifabad- వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Apr 25 , 2026 | 10:53 PM
ఉమ్మడి జిల్లా గిరిజన క్రీడాకారులు వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో శనివారం ఉమ్మడి జిల్లా గిరిజన విద్యార్థులకు ఏర్పాటు చేసిన వేసవి క్రీడల శిక్షణ శిబిరాన్ని గిరిజన జిల్లా సంక్షేమాధికారిణి రమదేవితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా గిరిజన విద్యార్థుల కోసం వేసవి క్రీడల శిక్షణలో భాగంగా హండ్‌బాల్, కబడ్డీ, అథ్లెటిక్స్‌పై శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు
ఆసిఫాబాద్‌రూరల్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లా గిరిజన క్రీడాకారులు వేసవి శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో శనివారం ఉమ్మడి జిల్లా గిరిజన విద్యార్థులకు ఏర్పాటు చేసిన వేసవి క్రీడల శిక్షణ శిబిరాన్ని గిరిజన జిల్లా సంక్షేమాధికారిణి రమదేవితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా గిరిజన విద్యార్థుల కోసం వేసవి క్రీడల శిక్షణలో భాగంగా హండ్‌బాల్, కబడ్డీ, అథ్లెటిక్స్‌పై శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. విద్యార్థులు ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. శిక్షణలో మెలకువలు నేర్చుకొని క్రీడల్లో రాణించాలన్నారు. యువత చదువుతో పాటు క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. వ్యసనాల బారిన పడకుండా లక్ష్యం చేరుకునేందుకు కష్ట పడాలని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు క్రీడ దుస్తులను అందజేశారు. కార్యక్రమంలో గిరిజన క్రీడల అధికారి మడావి శేకు, జీసీడీవో శకుంతల, ఎంసీవో ఉద్దవ్, హెచ్‌ఎం సాయిబాబా, పీడీ, పీఈటీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ
ఆసిఫాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 252 జీవో ప్రకారం అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అందజేస్తామని కలెక్టర్ కె హరిత అన్నారు. కలెక్టరే ట్‌లో శనివారం జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశానికి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. 2026 సంవత్సరానికి గాను కమిటీ ఆధ్వర్యంలో మొదటి విడతలో 94 నూతన అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయనున్నామని తెలిపారు. అక్రిడిటేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు 252 జీవోలో పేర్కొన్న అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాలని సూచించారు. సమావేశంలో డీపీఆర్‌వో సంపత్‌కుమార్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ సభ్యులు రహెమాన్, రవినాయక్, తుకారాం, సంతోష్, ప్రకాష్‌గౌడ్, చందు, అబీద్ ఆహ్మద్, వినయ్‌కుమార్, రాజు, అవినాష్ పాల్గొన్నారు.