Share News

వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - May 11 , 2026 | 11:34 PM

వేసవి సెలవుల్లో విద్యార్థులు సమ యం వృధా చేయకుండా వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకో వాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. నస్పూర్‌ పట్టణం తీగల్‌ పహాడ్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో సోమవారం వేసవి శిక్షణ శిబిరాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు.

వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
తీగల్‌ పహాడ్‌ పాఠశాలలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

నస్పూర్‌, మే 11 (ఆంధ్రజ్యోతి) : వేసవి సెలవుల్లో విద్యార్థులు సమ యం వృధా చేయకుండా వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకో వాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. నస్పూర్‌ పట్టణం తీగల్‌ పహాడ్‌ జిల్లా పరిషత్‌ పాఠశాలలో సోమవారం వేసవి శిక్షణ శిబిరాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు వేసవి శిక్షణ 15 రోజుల పాటు జరుగనున్నాయి. శిబిరంలో నృత్యం, యో గా, వ్యక్తిత్వ వికాసం, ఆటలు, పాటలు, మాక్‌ పార్లమెంట్‌ తదితర ఆంశా లపై శిక్షణ ఉంటుంది. శిక్షణ శిబిరం ప్రారంభోత్సవం సందర్భంగా విద్యా ర్థులు నిర్వహించిన నృత్యం, సాంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి.

అలాగే 12వ తేది నుంచి ఇదే పాఠశాలలో పదవ తరగతిలో అను త్తీర్ణులైన నస్పూర్‌, జైపూర్‌, మంచిర్యాల, హాజీపూర్‌ మండలాల ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తు న్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వేసవిలో అందిస్తున్న శిక్షణ శిబిరాల్లో పాల్గొనాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు సాం స్కృతిక, క్రీడ రంగంలో రాణించాలన్నారు. క్రమ శిక్షణ, పట్టదలతో లక్ష్యాన్ని సాధించే దిశగా ఎదగాలన్నారు. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన మెనూ అమలు చేసి ఆహారం అందించి ఆరోగ్యంపై శ్రద్ధ చూపా లన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ సంతోష్‌ కుమార్‌, మండల విద్యా ధికారి పద్మజా, సెక్టోరియల్‌ అధికారులు భరత్‌, కృష్ణమూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయకాంత్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2026 | 11:34 PM