ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - May 28 , 2026 | 11:24 PM
ఆర్టీసీ సేవలను ప్రతీ ఒక్కరు సద్విని యోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకట స్వామి పేర్కొన్నారు. గురువారం మండలంలోని టేకుమట్ల గ్రామంలో ఆర్టీసీ బస్సును ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు.
మంత్రి వివేక్‌వెంకట స్వామి
జైపూర్, మే 28 (ఆంధ్రజ్యోతి) : ఆర్టీసీ సేవలను ప్రతీ ఒక్కరు సద్విని యోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకట స్వామి పేర్కొన్నారు. గురువారం మండలంలోని టేకుమట్ల గ్రామంలో ఆర్టీసీ బస్సును ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. చెన్నూరు నియోజకవర్గంలో బస్సు సౌకర్యం లేని 14 గ్రామాలకు బస్సులు నడిపిం చాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించామన్నారు. నియోజకవర్గంలో ఎవరు ప్రయాణానికి ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశ్యంతో ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళల ఆర్థికాభి వృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన చరిత్ర బీఆర్ ఎస్‌దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు విశ్వంభర్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.