భూ ఆక్రమణకు పాల్పడుతున్న తహసీల్దార్
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:52 PM
ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యా పారులకు కట్టబెట్టి ఊర్కొండ తహసీల్దార్ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని బీ జేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్యాణ్ ఆరోపిం చారు.
- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్యాణ్
కందనూలు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యా పారులకు కట్టబెట్టి ఊర్కొండ తహసీల్దార్ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని బీ జేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్యాణ్ ఆరోపిం చారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాల యంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఊ ర్కొండ మండలంలోని ఊర్కొండపేట శి వారులో గల 120 సర్వే నెంబరులో 4ఎకరాల 10గుంటల భూమిని రియల్ ఉస్టేట్ వ్యాపారు లకు భూమార్పిడి చేశారని ఆయన ఆరోపిం చారు. ఈ సంఘటనపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రావు, జిల్లా కార్యదర్శి నాగేందర్‌గౌడ్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రకళ, జిల్లా నాయకులు జనార్దన్, చందు పాల్గొన్నారు.
బీజేపీలో చేరిన యువకులు
ఊర్కొండ, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : మం డలంలోని రేవల్లి గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన యువకులు శనివారం మహబూబ్ నగర్‌లో ఎంపీ డీకే అరుణ సమక్షంలో బీజేపీ చేరారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ జి ల్లా అధ్యక్షుడు ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు రాజేందర్‌గౌడ్, ఆంజనే యులు, లక్ష్మారెడ్డి, పరశురాములు ఉన్నారు.