నీటిపారుదల ఈఎన్‌సీ అడ్మిన్‌గా టి. శ్రీనివాస్
ABN , Publish Date - Feb 26 , 2026 | 03:02 AM
నీటిపారుదల శాఖలో కొన్నిరోజులుగా ఖాళీగా ఉన్న ఈఎన్‌సీ (అడ్మిన్) పోస్టును ప్రభుత్వం భర్తీ చేసింది. కామారెడ్డి ఈఎన్‌సీగా పనిచేస్తున్న తమథం శ్రీనివాస్‌రెడ్డికు ఈ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శాఖ ...
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): నీటిపారుదల శాఖలో కొన్నిరోజులుగా ఖాళీగా ఉన్న ఈఎన్‌సీ (అడ్మిన్) పోస్టును ప్రభుత్వం భర్తీ చేసింది. కామారెడ్డి ఈఎన్‌సీగా పనిచేస్తున్న తమథం శ్రీనివాస్‌రెడ్డికు ఈ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, త్వరలోనే శ్రీనివాస్‌రెడ్డిను పూర్తిస్థాయి ఈఎన్‌సీ (అడ్మిన్)గా కొనసాగించే అవకాశం ఉంది. ఇక తెలంగాణ ఇంజనీరింగ్ ల్యాబోరేటరీ డీజీగా ఉన్న అనితను కామారెడ్డి ఈఎన్‌సీగా నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి పదవీకాలం రెండేళ్లు పొడిగింపు
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో రెండేళ్ల పాటు పొడిగించింది. ఈమేరకు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కార్యదర్శి సీహెచ్ ప్రియాంక బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. శ్రీనివాస్‌రెడ్డిని మీడియా అకాడమీ చైర్మన్‌గా ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 25న రెండేళ్ల కాల పరిమితితో నియమించింది. ఆయన రెండేళ్ల పదవీ కాలం ఈ నెల 24తో ముగిసింది. మళ్లీ ఆయన పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు అంటే.. 2028 ఫిబ్రవరి 25 వరకు పొడిగించింది.