త్వరలోనే బీఆర్‌ఎస్‌లోకి జీవన్‌రెడ్డి..!
ABN , Publish Date - Apr 04 , 2026 | 05:18 AM
ఇటీవల కాంగ్రెస్‌కు వీడ్కోలు చెప్పిన ఆ పార్టీ సీనియర్ నేత టి. జీవన్‌రెడ్డి త్వరలోనే బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
ఈనెలలోనే కారెక్కే అవకాశం
హైదరాబాద్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కాంగ్రెస్‌కు వీడ్కోలు చెప్పిన ఆ పార్టీ సీనియర్ నేత టి. జీవన్‌రెడ్డి త్వరలోనే బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. స్పష్టమైన తేదీని ప్రకటించనప్పటికీ.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 8న విదేశీ పర్యటనను ముగించుకొని వచ్చిన తర్వాత ఆయనతో జీవన్‌రెడ్డి భేటీ అవుతారని తెలుస్తోంది. కారెక్కేందుకు ఆయన సిద్ధంగా ఉన్నప్పటికీ.. కేటీఆర్‌తో భేటీ తర్వాతే ఈ అంశంపై ఆయన స్పష్టతనిస్తారని సమాచారం. కుదిరితే ఈనెల రెండో వారం లేదంటే, బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన 27వ తేదీన జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.