Share News

శామా ప్రసాద్‌ ముఖర్జీని ఆదర్శంగా తీసుకోవాలి

ABN , Publish Date - Jul 06 , 2026 | 11:17 PM

దేశ ఐక్యతకు కృషి చేసిన జనసంఘ్‌ వ్యవస్థాపకులు డా. శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ జీవితాన్ని, ఆయన చూపిన మార్గాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘ నాథ్‌ వెరబెల్లి అన్నారు.

శామా ప్రసాద్‌ ముఖర్జీని ఆదర్శంగా తీసుకోవాలి
రెబ్బనపల్లిలో శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేస్తున్న రఘనాథ్‌

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘనాథ్‌ వెరబెల్లి

దండేపల్లి జూలై 6 (ఆంద్రజ్యోతి): దేశ ఐక్యతకు కృషి చేసిన జనసంఘ్‌ వ్యవస్థాపకులు డా. శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ జీవితాన్ని, ఆయన చూపిన మార్గాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘ నాథ్‌ వెరబెల్లి అన్నారు. డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా సోమవారం దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామంలో పార్టీ నాయకులు, కా ర్యకర్తలతో కలిసి శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంత రం పలుచోట్ల నాయకులతో కలిసి మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ భారతదేశ ఐక్యత కోసం, జీవి తాన్ని అంకితం చేసిన మహానీయుడన్నారు. ఆయన ఆ శయ సాధనకు బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు కృషి చే యాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు గోపతి రాజయ్య, పార్టీ మండల అధ్యక్ష కార్యదర్శు బందెల రవిగౌడ్‌, పత్తిపాక సంతోష్‌, నాయకులు కలాకర్‌రావు, శేఖర్‌, శ్రీనివాస్‌, సు రేందర్‌, వెంకటేష్‌, అనిల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 06 , 2026 | 11:17 PM