Share News

kumaram bheem asifabad- ఉప్పొంగిన ఒర్రెలు.. నిలిచిన రాకపోకలు

ABN , Publish Date - Aug 24 , 2026 | 10:52 PM

మండలంలో ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి మండలంలోని ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వాగు అవత ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని కుశ్నపల్లి-సోమిని గ్రామాల మధ్య ఒర్రెలు ఉధృతంగా ప్రవహించడంతో సుశ్మీర్‌, సోమిని, నాగెపల్లి, ఇప్పలగూడ, పాతసోమిని, మొగవెల్లి, బండలగూడ, గెర్రెగూడ తదితర గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

kumaram bheem asifabad- ఉప్పొంగిన ఒర్రెలు.. నిలిచిన రాకపోకలు
ఉధృతంగా ప్రవహిస్తున్న కుశ్నపల్లి ఒర్రె

బెజ్జూరు, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) మండలంలో ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి మండలంలోని ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వాగు అవత ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని కుశ్నపల్లి-సోమిని గ్రామాల మధ్య ఒర్రెలు ఉధృతంగా ప్రవహించడంతో సుశ్మీర్‌, సోమిని, నాగెపల్లి, ఇప్పలగూడ, పాతసోమిని, మొగవెల్లి, బండలగూడ, గెర్రెగూడ తదితర గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా లోలెవల్‌ వంతెనలపై బ్రిడ్జిలు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు.

చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఖేతిని, దిందా గ్రామాల మధ్య ఉన్న వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో దిందా గ్రామ వాసులకు రాక పోకలు నిలిచి పోయాయి. ఇన్నాళ్లు వర్షాల కోసం ఎదురు చూసిన రైతాంగానికి ఈ వర్షంతో ఊరట లభించింది. పత్తి, వరి ఇతర పంటలకు వర్షం మేలు చేస్తుందని రైతులు చెబుతున్నారు.

Updated Date - Aug 24 , 2026 | 10:52 PM