kumaram bheem asifabad- ఉప్పొంగిన ఒర్రెలు.. నిలిచిన రాకపోకలు
ABN , Publish Date - Aug 08 , 2026 | 10:51 PM
మండలంలో శుక్రవారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి ఒర్రెలు ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని కుశ్నపల్లి-సోమిని గ్రామాల మధ్య ఉన్న ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వాగు అవతల ఉన్న గ్రామాలైన సుశ్మీర్, సోమిని, పాతసోమిని, ఇప్పలగూడ, గెర్రెగూడ, నాగెపల్లి, బండలగూడ, మొగవెల్లి తదితర గ్రామాలకు పూర్తిగా బాహ్యప్రపంచం తో సంబంధాలు తెగిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.
బెజ్జూరు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): మండలంలో శుక్రవారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి ఒర్రెలు ఉప్పొంగి ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని కుశ్నపల్లి-సోమిని గ్రామాల మధ్య ఉన్న ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వాగు అవతల ఉన్న గ్రామాలైన సుశ్మీర్, సోమిని, పాతసోమిని, ఇప్పలగూడ, గెర్రెగూడ, నాగెపల్లి, బండలగూడ, మొగవెల్లి తదితర గ్రామాలకు పూర్తిగా బాహ్యప్రపంచం తో సంబంధాలు తెగిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. లోలెవల్ వంతెనలపై హైలెవల్ వంతెనలు చేపట్టాలని ఎన్నో ఏళ్లుగా గిరిజనులు కోరుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. కాగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు రైతులు సాగు చేస్తున్న పంటలకు ఊపిరి పోస్తుండదంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వరుస వర్షాల కారణంగా సాగు పనులు కూడా జోరందుకున్నాయి. కానీ వాగుల వల్ల ఎన్నో ఏళ్లుగా వంతెనలు లేక అవస్థలు పడుతున్నా తమ సమస్యను పరిష్కరించడం లేదని పాలకుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల వ్యాప్తంగా శుక్రవారం రాత్రి భారీ వర్షం కురువడంతో వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షం కారణంగా గిరివెల్లి బీటీ రోడ్డుపై వర్షం నీరు నిలిచింది. దీంతో ఈ ప్రాంత వాసులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గిరివెల్లి, ఖర్జి, మొట్లగూడ, రాంపూర్, దిగడ ప్రాంతాల వాసులు మండల కేంద్రానికి రావాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్ పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.