Share News

kumaram bheem asifabad- ఉప్పొంగిన పెన్‌ గంగ

ABN , Publish Date - Aug 01 , 2026 | 10:57 PM

సిర్పూరు(టి) వెంకట్రావుపేట వద్ద గల పెన్‌గంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో ఎగువ కురుస్తున్న భారీ వర్షాలు, అక్కడి ప్రాజెక్టుల్లో నీటిని వదలతో ఉగ్రరూపం దాలుస్తోంది. దీంతో అటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, తెలంగాణ రాక పోకలకు నిలిచి పోయాయి. ఇటు సిర్పూరు(టి) నుంచి వెళ్లే మహారాష్ట్ర మాకొడి వద్ద గల హుడ్కిలి వద్ద వంతెనపై నీరు పారుతోంది.

kumaram bheem asifabad- ఉప్పొంగిన పెన్‌ గంగ
సిర్పూరు(టి) మండలంలోని పొడ్సా వద్ద పెరుగుతున్న నీటి ఉధృతి

- మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు నిలిచిన వాహనాల రాకపోకలు

సిర్పూరు(టి), ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): సిర్పూరు(టి) వెంకట్రావుపేట వద్ద గల పెన్‌గంగ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో ఎగువ కురుస్తున్న భారీ వర్షాలు, అక్కడి ప్రాజెక్టుల్లో నీటిని వదలతో ఉగ్రరూపం దాలుస్తోంది. దీంతో అటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, తెలంగాణ రాక పోకలకు నిలిచి పోయాయి. ఇటు సిర్పూరు(టి) నుంచి వెళ్లే మహారాష్ట్ర మాకొడి వద్ద గల హుడ్కిలి వద్ద వంతెనపై నీరు పారుతోంది. అలాగే పారిగాం వంతెన వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కుమురం భీం జిల్లా నితికా పంత్‌, డీఎస్పీ వహిదోద్దీన్‌లు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా బ్యాక్‌ వాటర్‌ సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఎఫ్‌ఆర్‌, పోలీసు సిబ్బందితో నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వరద ఉదృతి తగ్గేంత వరకు ఎవరి ని కూడా అనుమతించకూడదని సూచించారు. దీంతో పాటు లోతట్టు ప్రాంతాలైన ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరమైతేనే బయటికి రావాలన్నారు. పోలీసుల సహాయం ఎళ్లవేళలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కె ప్రసాద్‌, ఎస్సై సాగర్‌, ఎంపీవో బోడ వినోద్‌, పంచాయతీ సెక్రటరి సందీప్‌కుమార్‌, ఉపసర్పంచు దివాకర్‌, రైతులు, ఉన్నారు. హుడ్కిలి, జక్కాపూర్‌, మాకిడి, వెంకట్రావుపేట తదితర ప్రాంతాల్లో పెన్‌ గంగ బ్యాక్‌ వాటర్‌ చేరి పత్తి పంట వేలాది ఎకరాల్లో నీట మునిగింది. కాగా శనివారం సంతకు వెంకట్రావుపేట, హుడ్కిలి వంతెనలపై వరద నీరు చేరడంతో ప్రజలు రాలేక పోయారు. దీంతో సంత వెలవెల బోయింది.

Updated Date - Aug 01 , 2026 | 10:57 PM