kumaram bheem asifabad-చేదెక్కిన తీపి.. ఘాటెక్కిన ఉల్లి..
ABN , Publish Date - Aug 23 , 2026 | 10:19 PM
నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యుడి బడ్జెట్‌పై పెద్ద భారమే మోపుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన వేళ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత వారంతో పోల్చుకుంటే కిలో చక్కెర ధర హోల్‌సేల్‌లో రూ. 42 ఉండగా ప్రస్తుతం రూ. 68కి చేరింది. ఉల్లి రూ. 40 నుంచి రూ. 70కి చేరింది. ఇలా నిత్యావసరాల ధరలు పెరిగిపోతుండడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నాయి.
- వారం రోజుల్లోనే క్వింటాల్ చక్కెర రూ.6,800లకు పెంపు
- విలవిలలాడుతున్న సామాన్యులు
బెజ్జూరు, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యుడి బడ్జెట్‌పై పెద్ద భారమే మోపుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైన వేళ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత వారంతో పోల్చుకుంటే కిలో చక్కెర ధర హోల్‌సేల్‌లో రూ. 42 ఉండగా ప్రస్తుతం రూ. 68కి చేరింది. ఉల్లి రూ. 40 నుంచి రూ. 70కి చేరింది. ఇలా నిత్యావసరాల ధరలు పెరిగిపోతుండడంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నాయి. శ్రావణమాసం వచ్చిందంటే పండగల సీజన్ ప్రారంభమైనట్టే. పండగలు వస్తే ప్రతి ఇంట్లోనూ పూజలు, పిండి వంటలు చేసుకోవడం ఆనవాయితీ. అయితే ఈ సారి శ్రావణ మాసంలో పంచదార ధర కొండెక్కడంతో పాటు, అదే దారిలో కొబ్బరికాయలు, వంట నూనె ధరలు కూడా అమాంతం పెరిగిపోవడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. పండగలు ఎలా చేసుకోవాలని, పిండి వంటలు ఎలా తినాలో తెలియక సతమతమవుతున్నారు.
- అమాంతం పెరిగిన ధరలు..
ఈ వానాకాలం సీజన్ ప్రారంభం నుంచే ఎల్‌నినో ప్రభావం ఉంటుందన్న ప్రచారం కారణంగా నెల రోజుల క్రితమే బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం పండగ సీజన్‌తో పాటు వివాహాది శుభకార్యాలు కూడా ప్రారంభం కావడంతో పంచదార ధర భారీగా పెరిగింది. గత వారం రోజుల క్రితం హోల్‌సేల్‌లో క్వింటాల్ చక్కెర ధర రూ.4200ఉండగా, ప్రస్తుతం అది రూ. 6800లకు చేరుకుంది. ఇక రిటైల్ మార్కెట్‌లో వ్యాపారులు కిలోకు రూ.70చొప్పున విక్రయిస్తున్నారు. మరోవైపు కొబ్బరికాయల ధరలు కూడా భగ్గుమంటున్నాయి. ఇటీవల వరకు హోల్‌సేల్‌లో నాణ్యతను బట్టి రూ.20నుంచి 25వరకు పలికిన కొబ్బరికాయ, ప్రస్తుతం హోల్‌సేల్‌లోనే రూ.30కి చేరింది. రిటైల్‌లో ఒక్కో కాయను రూ.35వరకు అమ్ముతున్నారు. వంటనూనెల విషయానికి వస్తే ప్రీడమ్, గోల్డ్‌డ్రాప్, సన్‌ప్లవర్ తదితర బ్రాండ్లు లీటరు నూనె గతంలో రూ.160ఉండగా, ప్రస్తుతం రూ.180కి చేరింది. పామాయిల్ ధరలు కూడా లీటరుకు రూ.20చొప్పున పెరిగాయి. ఈ ధరల పెరుగుదల ప్రభావం సామాన్యులు తాగే టీ, టిఫిన్ల మీద కూడా పడుతోందని వాపోతున్నారు. ఇక వీటితో పాటు నాణ్యమైన సన్నరకం బియ్యం ధర సైతం ఇటీవలి వరకు క్వింటాల్‌కు రూ.6వేలు ఉండగా, ప్రస్తుతం రూ.8వేల వరకు విక్రయిస్తున్నారు. ఏది ఏమైనా పండగల సీజన్‌లో అన్ని రకాల నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరుగుతుం డడంతో సామాన్యులు బతుకు బండిని ఎలా లాగాలంటూ ఆవేదన చెందుతున్నారు.