Share News

మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

ABN , Publish Date - Jun 27 , 2026 | 11:30 PM

బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్‌ క మిటీ చైర్మన్‌గా రత్నం సుకుమారి, డైరెక్టర్‌ల ప్రమాణ స్వీకారం శనివారం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో జరిగింది.

మార్కెట్‌ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

బెల్లంపల్లి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి) : బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్‌ క మిటీ చైర్మన్‌గా రత్నం సుకుమారి, డైరెక్టర్‌ల ప్రమాణ స్వీకారం శనివారం వ్యవసాయ మార్కెట్‌ యార్డులో జరిగింది. ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ ముఖ్య అ తిథిగా హాజరై ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎ మ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వె ళ్తుందని, మార్కెట్‌ కమిటీకి రైతులు అండగా ఉండాలన్నారు. నూతనంగా ఎ న్నికైన మార్కెట్‌ కమిటీ డైరెక్టర్లు, చైర్మన్‌ నిత్యం రైతుల సమస్యల పరిష్కా రంపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో బెల్లంపల్లి మార్కెట్‌ కమిటీని ఆదర్శ వంతంగా తీర్చిదిద్దాలన్నారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఎదురైనా రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. గత ప్రభు త్వం పదేళ్లలో చేయలేని అభివృద్ధిని సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్నారన్నారు. అం తకుముందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి మార్కెట్‌ యార్డు వరకు బైకులు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కెట్‌ కమిటీ కా ర్యాలయం చాంబర్‌లో నూతనంగా ఎన్నికైన చైర్మన్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాధ్‌రెడ్డి, బె ల్లంపల్లి మున్సిప్‌ చైర్‌పర్సన్‌ దావ స్వాతిరమేష్‌బాబు, మార్కెట్‌ కమిటీ డైరె క్టర్‌ భాస్కర్‌, కాంగ్రెస్‌ మండల, పట్టణ అధ్యక్షులు పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 11:30 PM