Share News

భవిష్యత్తుకు మణిహారం.. స్వర్గసీమ విభవ

ABN , Publish Date - Apr 27 , 2026 | 05:01 AM

భవిష్యత్తుకు మణిహారంగా స్వర్గసీమ విభవ వెంచర్‌ మారనుందని, రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విభవ వెంచర్‌ను ప్రారంభించినట్లు వెంచర్‌ అధినేత చండ్ర ...

భవిష్యత్తుకు మణిహారం.. స్వర్గసీమ విభవ

  • అట్టహసంగా స్వర్గసీమ విభవ వెంచర్‌ ప్రారంభం

  • అద్భుతమైన వెంచర్‌లో రూ.15లక్షలకే 150 గజాల స్థలం

  • స్వర్గసీమ వెంచర్‌ అధినేత చండ్ర చంద్రశేఖర్‌

జడ్చర్ల, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తుకు మణిహారంగా స్వర్గసీమ విభవ వెంచర్‌ మారనుందని, రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు విభవ వెంచర్‌ను ప్రారంభించినట్లు వెంచర్‌ అధినేత చండ్ర చంద్రశేఖర్‌ వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా రాజాపూర్‌ మండలం తిరుమలాపూర్‌ సమీపంలో ఆదివారం విభవ ప్లాట్ల వెంచర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 75 ఎకరాలలో 999 ప్లాట్లతో ఈ వెంచర్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. పర్యావరణహితమైన, సకల వసతులతో నివాస స్థలాలను సామాన్యులకు అందుబాటులో తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. తమ వెంచర్‌లో తక్కువ ధరలకే ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకు ఎస్టిమేషన్‌ ప్రకారం చదరపు గజానికి రూ.12 వేలు ఉందని, ప్రారంభోత్సవం సందర్భంగా తగ్గింపు ధరతో చదరపు గజానికి రూ.9999కే విక్రయిస్తున్నామని వివరించారు. బెంగళూరు హైవేతో పాటు రీజనల్‌ రింగ్‌ రోడ్డుకు అతి సమీపంలో వెంచర్‌ ఉందని తెలిపారు. రూ.15 లక్షల బడ్జెట్‌ నుంచి ప్లాట్లను కొనుగోలు చేయవచ్చన్నారు. 150 గజాల స్థలం రూ.15 లక్షలకే లభించనుందని చెప్పారు. విభవ వెంచర్‌కు సుమారు కిలోమీటరు దూరంలో స్వర్గసీమ రిసార్ట్‌ ఉందని, ప్లాట్లు కొనుగోలు చేసినవారు అందులో డీఫాల్ట్‌గా సభ్యులు అవుతారని వివరించారు. హైదరాబాద్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారంతా కుటుంబంతో సహ తమ వెంచర్‌ను సందర్శించాలని ఆయన కోరారు. నూతనంగా ప్రారంభించిన విభవ ప్లాట్ల వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసేందుకు పెద్దఎత్తున కొనుగోలు దారులు, పెట్టుబడిదారులు తరలివచ్చారు. ప్రాజెక్ట్‌లో విద్యార్థుల కోసం రెండు ఎకరాలలో పాఠశాల, మరో రెండు ఎకరాలలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ కోసం స్థలాన్ని, 9 పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

Updated Date - Apr 27 , 2026 | 05:01 AM