Share News

kumaram bheem asifabad- ఎస్పీఎంలో ఎన్నికలపై ఉత్కంఠ

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:08 PM

కుమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూరు పేపర్‌మిల్లు (ఎస్పీఎం)లో ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికల అంశంపై ఉత్కంఠ నెలకొన్నది. మిల్లు పునఃప్రారంభమైన ఎని మిదేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటి వరకు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించక పోవడంతో కార్మికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

kumaram bheem asifabad- ఎస్పీఎంలో ఎన్నికలపై ఉత్కంఠ
లోగో

- యాజమాన్యం తీరును నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో 33 రోజులుగా దీక్షలు

కాగజ్‌నగర్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌లోని సిర్పూరు పేపర్‌మిల్లు (ఎస్పీఎం)లో ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికల అంశంపై ఉత్కంఠ నెలకొన్నది. మిల్లు పునఃప్రారంభమైన ఎని మిదేళ్లు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటి వరకు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించక పోవడంతో కార్మికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరో వైపు ఎన్నికల నిర్వహణ అంశం న్యాయపరమైన వివాదంలో చిక్కుకోవడతో ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. సిర్పూరు పేపర్‌ మిల్లు 2014 వరకు బిర్లా యాజమాన్యం ఆధ్వర్యంలో కొన సాగింది. ఆర్థిక సంక్షోభం కారణంగా షెట్‌డౌన్‌కు దారి తీసిం ది. మిల్లుపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ న్నాయి. కాగజ్‌నగర్‌ పట్టణ ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం పడింది. మిల్లు పునఃప్రారంభం కోసం కార్మిక సం ఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు దళల వారీ ఉద్యమాలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో అప్ప టి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటిం చింది.

ఫ జేకే యాజమాన్యం ఆధ్వర్యంలో..

ఈ మేరకు జేకే యాజమాన్యం ఆధ్వర్యంలో 2018 మిల్లు పునఃప్రారంభమైంది. మిల్లు తెరుచుకోవడంతో కార్మికుల్లో ఉద్యోగంపై ఆశలు చిగురించాయి. కానీ పాత కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోలేదు. మిల్లు మూతపడే సమయంలో పని చేసిన కార్మికు ల్లో సుమారు 200 మందిని ఇప్పటికీ విధుల్లోకి తీసుకోలేదు. కార్మికులకు న్యాయం చేయాలని పలువురు నాయకులు పలుమార్లు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఈ ప్రాంత కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా జేకే యాజమాన్యం ఇతర రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి పనులు చేయిస్తోంది. వేతనాల విషయంలోనూ వ్యత్యాసం చూపించడం, సెలవులు తీసుకుంటే కోత విధించడం, ప్రమాదాలు జరుగుతున్న సమయంలో యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలపై కార్మికుల్లో వ్యతిరేక వచ్చింది. ఈ విషయంలో ప్రశ్నించిన కార్మికులపై వివిధ రకాలుగా యాజమాన్యం చర్యలు తీసుకుంటుండడంపై తీవ్ర ఆందోళన నెలకొన్నది. సమస్యలపై పోరాడేందుకు ట్రేడ్‌ యూనియన్‌ లేక పోవడమేనన్న భావన కార్మికుల్లో నాటుకుంది. యాజమాన్యం కూడా నూతన లేబర్‌ కోడ్‌ ప్రకారం మిల్లులో ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికలు నిర్వహించకూడదని హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ రాష్ట్రంలోనే నూతన లేబర్‌ కోడ్‌ అమలు కానప్పటికీ ఎన్నికలు నిలిపివేయడం సరికా దని, కార్మిక సంఘాల నాయకులు కార్మికశాఖ అధికారులకు వినతి పత్రాలు సమర్పించి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.

- మిల్లు పునఃప్రారంభమై..

మిల్లు పునఃప్రారంభమై ఎనిమిదేళ్లు గడిచినా కార్మికుల సమస్యలు పరిష్కారం కాక పోవడం, గుర్తింపు సంఘం లేక పోవడం వల్ల కార్మికుల గొంతుక బలహీనపడుతోందని చెబుతున్నాయి. ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య పద్ధతిలో గుర్తిం పు సంఘాన్ని ఎన్నుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికలు నిర్వంచాలని కోరుతూ కాగజ్‌నగర్‌ ఎస్పీఎం గేటు ఎదుట కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 33 రోజులుగా నిరవధిక దీక్షలు చేపడుతున్నారు. ఇటీవల సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు, ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు కార్మికశాఖ సెక్రటరీతో హైదరాబాద్‌లో ఎన్నికల నిర్వహణపై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కూడా యాజమాన్యం నుంచి స్పష్టమైన సమాధానం రాక పోవడంతో కార్మికులు నిరాశ చెందుతున్నారు. మిల్లులో వెంటనే ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికలు నిర్వహించాల్సిందే కార్మిక సంఘాలు పోరు బాటను ఉధృతం చేస్తున్నాయి. ఇటీవల తెలంగాణ రక్షణ సమితి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ శిబిరాన్ని సందర్శించి మద్దతు పలికారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని, నూతన లేబర్‌ కోర్టు యాక్టుతో సంబం ధం లేకుండా వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కవిత డిమాండ్‌ చేశారు. రోజు రోజుకు పోరాటం తీవ్రతరం అవుతుండడంతో ప్రభుత్వం కూడా హైకోర్టులో ఉన్న కేసును పరిగణలోకి తీసుకొని అఫిడవిట్‌ దాఖాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఒక వైపు పెం డింగ్‌లో ఉన్న కార్మికుల పునర్నియామకం, మరో వైపు ట్రేడ్‌ యూనియన్‌ ఎన్నికల అంశాలు ఎస్పీఎంలో ప్రధాన చర్చనీయాంశాలుగా మారాయి.

Updated Date - Jun 23 , 2026 | 11:08 PM