నత్తనడకన భువన్ సర్వే...!
ABN , Publish Date - Apr 02 , 2026 | 11:51 PM
రాష్ట్ర వ్యా ప్తంగా అన్ని పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో ఆస్తుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేసేందుకు ప్రవేశపె ట్టిన భువన్ సర్వే మళ్లీ పునః ప్రారంభమైన ప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగానే పరి స్థితులు ఉన్నాయి.
-పట్టణాల్లో ఆస్తుల వివరాల నమోదు పూర్తయ్యేదెన్నడో..?
-2020లో తొలిసారి ప్రారంభించిన అప్పటి ప్రభుత్వం
-అనివార్య కారణాల వల్ల అర్థాంతరంగా నిలిచిన సర్వే
-కాంగ్రెస్ ప్రభుత్వంలో పునః ప్రారంభమైన కార్యక్రమం
-అయినా ముందుకు కదలని ఆస్తుల గణన
మంచిర్యాల, ఏప్రిల్ 2 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర వ్యా ప్తంగా అన్ని పట్టణ, స్థానిక సంస్థల పరిధిలో ఆస్తుల వివరాలను ఖచ్చితంగా నమోదు చేసేందుకు ప్రవేశపె ట్టిన భువన్ సర్వే మళ్లీ పునః ప్రారంభమైన ప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అన్న చందంగానే పరి స్థితులు ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసినా జిల్లా వ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలలో దాదా పు 18 వేల వరకు ఆస్తుల వివరాలు నమోదు కాకపోవడమే దీనికి నిదర్శనం. సర్వేలో భాగంగా ఉపగ్రహ ఆధారిత ఫొటో లు తీయడంతో పాటు ఆస్తి పన్నుకు సంబంధించి క్షే త్రస్థాయిలో సిబ్బంది పర్యటించి వివరాలు ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. అసస్‌మెంట్ వాస్తవ విస్తీ ర్ణానాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా పన్ను విధిం చే వెసులుబాటు భువన్ సర్వేయాప్ ద్వారా కలుగు తుంది. ప్రతీ ఆస్తికి పది అంకెల ప్రాపర్టి టాక్స్ ఐడెం టిఫికేషన్ నెంబరు (పీటీఎన్) కేటాయిస్తారు. సర్వే ఆధారంగా ఆస్తులకు సంబంధించి ఏ మాత్రం తేడా లేకుండా ఖశ్చితమైన పన్ను విఽధించేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా యజమానులకు ఎక్కువ, తక్కువ ఆస్తి పన్నులు నమోదు చేసేందుకు అవకాశం ఉండ దు. దీని వల్ల ఆస్తికి సరిపడా పన్ను చెల్లించాల్సి రావ డంతో యజమానికి నష్టం కలిగే అవకాశాలు తొలగిపోతాయి.
అవకతవకలకు అడ్డుకట్ట...
రాష్ట్రంలోని పట్టణ, స్థానిక సంస్థలు ప్రతి సంవ త్సరం దాదాపు రూ. 900 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేస్తున్నాయి. అయితే పన్ను విధింపులో అనేక అవ కతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉ న్నాయి. పలు ప్రాంతాల్లో యజమానులు స్థానిక సి బ్బందితో కుమ్మక్కై ఆస్తి విలువ, వైశాల్యం తక్కువగా చూపించడం ద్వారా ఆస్తి పన్నులో తగ్గింపులు జరుపు తున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాగే వాణిజ్యపర మైన ఆస్తిని కొన్ని ప్రాంతాల్లో నివాస గృహాలుగా చూ పించి కూడా పన్ను తగ్గింపునకు ప్రయత్నాలు జరు గుతున్నాయి. మరోవైపు కొన్ని సందర్భాల్లో ఆస్తి విలువ కు అదనంగా పన్ను విధిస్తున్న సందర్భాలు కూడా ఉ న్నాయి. ఇలాంటి అవకతవకలకు చెక్‌పెట్టే ఉద్దేశ్యంతో నే ప్రతి ఆస్తిని ఉపగ్రహ ఆధారిత మ్యాపింగ్ చేయా లని తలపెట్టి 2020లోనే లాంఛనంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది.
నిలిచిన సర్వే...
ఇదిలా ఉండగా 2020లో ప్రారంభించిన భువన్ సర్వే కొంతకాలం పాటు సక్రమంగా నిర్వహించిన ప్ప టికీ అనివార్య కారణాల వల్ల అది పూర్తిగా నిలిచిపో యింది. కరోనా విపత్తు కారణంగా దాదాపు రెండేళ్లపా టు సర్వే నిలిచిపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగి పోయాయి. సర్వే ప్రారంభించిన కొత్తలో జిల్లా వ్యాప్తం గా దాదాపు 40వేల అసస్‌మెంట్లను గుర్తించగా అందు లో సుమారు 20వేల వరకు సర్వే పనులు పూర్తి చే శారు. మిగితా మొత్తం పెండింగ్‌లో ఉండిపోయింది. ఆ తరువాత 2023లో సర్వేను తిరిగి ప్రారంభించినప్ప టికీ సాంకేతిక లోపం కారణంగా మళ్లీ అంతరాయం ఏర్పడింది.
కాంగ్రెస్ హయాంలో పునఃప్రారంభం...
2020లో ప్రారంభమై అర్థాంతరంగా నిలిచిపోయిన భువన్‌యాప్ సర్వేను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మళ్లీ కొ నసాగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సర్వే పున: ప్రారంభిం చాలని 2024లోనే జిల్లాలోని మునిసిపాలిటీలకు ఆదే శాలు జారీ అయ్యాయి. సర్వే పునః ప్రారంభమైన త రువాత ఆస్తుల గుర్తింపు వేగంగా జరిగినప్పటికీ సాం కేతిక సమస్యలు, ఇతరత్రా కారణాల వల్ల మళ్లీ తాత్కా లికంగా నిలిచిపోయింది. దీంతో 2025-26లో లక్ష్యం మే రకు సర్వే జరగలేదు. పంచాయతీ, మునిసిపల్ ఎన్ని కల నిర్వహణ కారణంగా అధికారులంతా ఆయా విధుల్లో బిజీగా ఉండటంతో పనులు ముందుకు సాగ లేదు. ఆర్థిక సంవత్సరం ముగిసి, నూతన సంవత్స రం లోకి అడుగు పెట్టినప్పటికీ ఇప్పటి వరకు ఇంకా ఆస్తు ల సర్వే పూర్తి కాకపోవడం విశేషం. గడిచిన ఆర్థిక సం వత్సరానికి సంబంధించి మంచిర్యాల మునిసిపల్ కా ర్పొరేషన్ పరిధిలో 14వేల వరకు ఆస్తుల సర్వే చేప ట్టవలసి ఉండగా, బెల్లంపల్లి మునిసిపాలిటీలో మూడు వేలు, చెన్నూరులో 300, క్యాతన్‌పల్లిలో 450, మంద మర్రి మునిసిపాలిటీలో 250 వరకు పెండింగ్‌లో ఉన్నా యి. ఇక లక్షెట్టిపేటలో వాస్తవానికి భిన్నంగా ఇప్పటికే ఆస్తిపన్నులు అధికంగా ఉన్నాయన్న వాదనలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లక్షెట్టిపేట మునిసిపాలిటీ పరిధిలో భువన్ సర్వే చేపట్టే పరిస్థితు లు లేవు. ఒకవేళ సర్వే నిర్వహించాల్సి వస్తే ప్రజలపై ఆస్థిపన్ను భారం తగ్గే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీ యంగా తెలిసింది. ఇదిలా ఉండగా, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మునిసిపాలిటీల వారీగా నాలుగు రోజుల క్రితం మళ్లీ లక్ష్యం విధించారు. ఇప్ప టికే గత సంవత్సర టార్గెట్‌లో దాదాపు సగభాగం వర కు పెండింగ్‌లో ఉండగా, మళ్లీ కొత్త లక్ష్యం విధించ డంతో సర్వే పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియ ని పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం 2027 జనాభా లె క్కల గణన చేపట్టవలసి ఉండగా, ఇందుకు సంబం ధించిన సిబ్బంది శిక్షణ కార్యక్రమాల ఏర్పాటుకు కార్యా చరణ రూపొందించే పనుల్లో అధికార యంత్రాంగం బి జీగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో భువన్ సర్వే ప్రా రంభం సాధ్యపడుతుందా...? అన్న సందేహాలు వ్యక్త మవుతున్నాయి. కాగా భువన్ సర్వే పూర్తయితే స్థాని క సంస్థలకు భారీగా ఆదాయం సమకూరే అవకాశా లు ఉన్నాయి. ఇంతకాలం కింది స్థాయి సిబ్బందితో కుమ్మక్కై తక్కువ పన్ను విధించేలా ఏర్పాట్లు చేసుకు న్న యజ మానులకు మాత్రం 2020 నుంచి కోల్పో యిన మొత్తాన్ని స్థానిక సంస్థలు వసూలు చేసే అవకా శాలు ఉన్నట్లు తెలుస్తోంది.