Share News

kumaram bheem asifabad-పంట చీడ పీడలపై నిఘా వ్యవస్థ

ABN , Publish Date - Aug 18 , 2026 | 10:55 PM

పంటలను ఆశించే చీడపీడలను ముందుగానే గుర్తించి రైతులకు సకాలంలో సూచనలు అందించేందుకు కేంద్ర ప్రభు త్వం నేషనల్‌ పెస్ట్‌ సర్వైలెన్స్‌ సిస్టం(ఎన్‌పీఎస్‌ ఎస్‌) ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2024 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ వ్యవస్థను వ్యవసాయ శాఖతో పాటు మొక్కల సంరక్షణ విభాగాలు, వ్యవ సాయ విస్తరణ సిబ్బంది, రైతులకు వినియోగించుకు నేందుకు అవకాశం కల్పించారు.

kumaram bheem asifabad-పంట చీడ పీడలపై నిఘా వ్యవస్థ
లోగో

- చిత్రం తీస్తే తెగుళ్లను పట్టేస్తుంది

రెబ్బెన, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): పంటలను ఆశించే చీడపీడలను ముందుగానే గుర్తించి రైతులకు సకాలంలో సూచనలు అందించేందుకు కేంద్ర ప్రభు త్వం నేషనల్‌ పెస్ట్‌ సర్వైలెన్స్‌ సిస్టం(ఎన్‌పీఎస్‌ ఎస్‌) ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2024 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ వ్యవస్థను వ్యవసాయ శాఖతో పాటు మొక్కల సంరక్షణ విభాగాలు, వ్యవ సాయ విస్తరణ సిబ్బంది, రైతులకు వినియోగించుకు నేందుకు అవకాశం కల్పించారు. ఎన్‌పీఎస్‌ఎస్‌ మోబైల్‌ యాప్‌ ద్వారా పొలంలో కన్పించే చీడపీడల ఫొటోలను తీసి నమోదు చేస్తే చాలు కృత్తిమ మేథస్సు(ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ సాంకేతికతతో వాటి ని గుర్తించి పంట రక్షణకు అవసరమైన సలహాలను అందిస్తోంది. దీంతో చీడపీడల ఉధృతి పెరుగక ముందే నివారణ చర్యలు చేపట్టే అవకాశం ఉండడం ఈ యాప్‌ యొక్క ప్రత్యేకత.

- 65 రకాల పంటలను..

కాగా ప్రస్తుతం ఈ యాప్‌ ద్వారా 65 రకాల పంటలను, 400కుపైగా చీడపీడలను గుర్తి స్తోంది. పంటలపై చీడపీడల ప్రభావాన్ని పర్యవేక్షించడంతో పాటు రైతులకు సమయా నుకూలంగా సలహాలు అందించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. కేంద్ర వ్యవ సాయ శాఖ పరిధిలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ ప్రొటె క్షన్‌ క్యారెంటైన్‌, స్టోరేజ్‌ కార్యాలయం, ఐసీఎఆర్‌ శాస్త్ర వేత్తలు సహాకారంతో యాప్‌ను రూపొందించింది. రైతలకు అవగాహన కల్పించే బాధ్యతను కేంద్రీయ సమగ్ర సస్య రక్షణ కేంద్రానికి అప్పగించారు. యాప్‌లో రైతు పేరు, సెల్‌ నెంబరు, గ్రామ పంట రకం, పంట కాలం, పంట దశ, చీడపీడల రకం, ప్రదేశం లాంటి వివరాలు నిక్షప్తం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు సంబంధిత సమాచారం. సస్యరక్షణ సలహాలు పొందవచ్చు.

- సూచనల కోసం..

సూచనల కోసం పురుగు మందుల దుకాణాలపై ఆధారపడడాన్ని తగ్గించడానికి వ్యవసా య శాస్త్రవేత్తలు, అధికారులతో నేరుగా మాట్లాడవచ్చు. దేశ వ్యాప్తంగా 60కిపైగా ప్రధాన పంటలు(వరి, పత్తి, మొక్క జొన్న, కూరగాయాలు, పండ్లు తదితరులు) ఆశించే వంద రకాల తెగుళ్లను గుర్తించి సలహాలు ఇస్తోంది. గతంలో ఈ యాప్‌లో ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, గుజరాతీ భాషల్లో యాప్‌ సమాచారం ఉండేది. గతేడాది నుంచి తెలుగులోనూ అందుబా టులోకి వచ్చింది. పంటలకు చీడపీడలు ఆశిస్తే నేరుగా సెల్‌ ఫోన్‌తో ఫోటో తీసి యాప్‌లో నిక్షిప్తంగా చేయాలి. పంట పేరు నమోదు చేస్తే ఏ రకం తెగుళ్లు ఆశించాయి..? లక్షణాలు ఎలా ఉన్నాయి..? నివారణ చర్యలు చేపట్టే విధానం గుర్తించి సమగ్ర సమాచారం వస్తుంది. సకాలంలో చీడపీడల గుర్తిం చడం వల్ల పురుగుల ఉధృతిని తొందరగా కనిపెట్టే నివారించే విధానాలు సైతం సూచిస్తోంది. దీంతో రైతులకు సమయం ఆదాతో పాటు ఖర్చులు తగ్గిం చుకునే అవకాశం ఉంది. పంట దిగుబడి సైతం పెరి గే అవకాశం ఉంటుంది.

Updated Date - Aug 18 , 2026 | 10:55 PM