kumaram bheem asifabad- ‘ఉపాధి’పై నిఘా
ABN , Publish Date - May 30 , 2026 | 11:57 PM
గ్రామీణ కూలీల వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి కే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పేరును మార్చడంతో పాటు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. జూలై నుంచి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్ గ్రామీణ్ (జీరామ్‌జీ)గా మార్పునకు చర్యలు మొదలు పెట్ట్టింది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా నేరుగా కూలీలకు డబ్బులు చెల్లింపు, పనుల గుర్తింపు ప్రత్యేక యాప్‌లను కూడా రూపొందించింది
- పంచాయతీల వారీగా ఏర్పాటు
బెజ్జూరు, మే 30 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ కూలీల వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి కే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పేరును మార్చడంతో పాటు పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. జూలై నుంచి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్ గ్రామీణ్ (జీరామ్‌జీ)గా మార్పునకు చర్యలు మొదలు పెట్ట్టింది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా నేరుగా కూలీలకు డబ్బులు చెల్లింపు, పనుల గుర్తింపు ప్రత్యేక యాప్‌లను కూడా రూపొందించింది. ఏటా జిల్లాలో చేపట్టిన ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో పలు లోపాలు బయటపడుతున్నాయి. తనిఖీల్లో కొన్ని అక్రమాలు కూడా వెలుగు చూస్తున్న సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఉపాధి పనుల్లో మార్గదర్శకాలు పాటించడం లేదంటూ పనిదినాలను తగ్గిస్తుంది. దీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పకడ్బం దీగా అమలు చేసేందుకు అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా నిఘా వ్యవస్థ రూపక ల్పనకు దృష్టి పెట్టింది. వీబీ జీ రామ్ (ఉపాధిహామీ) పథకం పనులు పారద ర్శకంగా కొనసాగించడంపై ప్రభుత్వం ప్రత్యే క దృష్టి సారించింది. ఇందుకు అనుగుణంగా పనుల పర్యవేక్షణకు నిఘా కమిటీల ఏర్పా టుకు నిర్ణయించింది.
- గ్రామ పంచాయతీ స్థాయిలో
గ్రామ పంచాయతీ స్థాయిలో నిఘా పర్య వేక్షణ(విజిలెన్స్ మానిటరింగ్) కమిటీలను నియమించనుండబం గమనార్హం. ఆసిఫాబా ద్ జిల్లాలో 15మండలాల పరిధిలో 335 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో 84 వేల ఉపాధి జాబ్ కార్డులు ఉన్నాయి. ఇందు లో 1.52లక్షల మంది కూలీలు ఉన్నారు. 1.15లక్షల మంది కూలీలు పని చేస్తున్నారు. ఏటా నిర్దేశించిన పనులు చేపడుతున్నారు. మరోవైపు ఉపాధి పనులపై సామాజిక తని ఖీలు నిర్వహించి అవకతవకలు జరిగినట్లుగా నిర్ధారణ అవుతున్నా అధికారుల చర్యలు అంతంతే. జరిమానాలు విధించినా మార్పు రావడం లేదు. రికవరీ సైతం నామమా త్రంగానే ఉంటోంది. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పనిదినాల్లో కోత విధిస్తోంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం గ్రామాల్లో ఐదుగురితో కూడిన నిఘా కమిటీ నియా మకానికి పచ్చజెండా ఊపింది.
- ఎలా పని చేస్తుందంటే..
కమిటీలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రాతి నిథ్యం ఉంటుంది. సభ్యుల్లో సగం మంది మహిళ లు ఉంటారు. ఉపాధ్యాయుడు, అంగన్‌వాడీ టీచర్, స్వయం సహాయక సంఘం సభ్యురాలు, సామాజిక తనిఖీకి సం బంధించి ఒకరు, యువజన సంఘం నుంచి ఒకరిని సభ్యులుగా ఎంపిక చేస్తారు. పనులు జరిగిన వారానికి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. నాణ్యతా అంచనా వేయడం, కూలీల హాజరు, వేతన చెల్లింపులు తదితర వివరాలను నమో దు చేస్తారు. సామాజిక తనిఖీకి నివేదిస్తారు. వాటిని ప్రజాపత్రాలుగా పరిగణిం చాలని, గ్రామపంచాయతీల్లో అందుబాటులో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ద్వారా గ్రామపంచాయతీ స్థాయిలో పర్యవే క్షణ కమిటీ వల్ల అక్రమాలు. అవకతవకలకు కట్టడి పడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనుల్లో ఉదయం, మధ్యాహ్నం తర్వాత రెండు సార్లు ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం యాప్‌లో కూలీల ఫొటోలు దిగే విధంగా చర్యలు తీసుకున్నారు. పర్యవేక్షణ కమిటీలతో మరింత పారదర్శకం గా ఉపాధి పనులు కొనసాగుతాయని భావిస్తున్నారు.