తెలంగాణ, ఏపీ ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా సురేశ్ బత్తిని
ABN , Publish Date - Apr 10 , 2026 | 05:42 AM
ఆదాయ పన్ను శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి సురేశ్ బత్తిని నియమితులయ్యారు.
మరోసారి తెలుగు అధికారికే పగ్గాలు
హైదరాబాద్, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): ఆదాయ పన్ను శాఖ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్‌గా సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి సురేశ్ బత్తిని నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) గురువారం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సురేశ్‌కు హైదరాబాద్ రీజియన్‌లో ఆదాయ పన్ను శాఖ చీఫ్ కమిషనర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. 1991లో రెవెన్యూ సర్వీసులో చేరిన సురేశ్ బత్తిని.. సూరత్‌లో ఆదాయ పన్ను ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. సురేశ్ తెలుగు అధికారి రావడం గమనార్హం.