Share News

ప్రతీ కుటుంబానికిబీమాతో భరోసా

ABN , Publish Date - Nov 25 , 2026 | 11:42 PM

రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి ఇందిర మ్మ కుటుంబ బీమాతో భరోసా కల్పించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని నాగర్‌కర్నూల్‌ ఎ మ్మెల్యే డాక్టర్‌ కూచకళ్లు రాజేష్‌రెడ్డి అన్నారు.

ప్రతీ కుటుంబానికిబీమాతో భరోసా
నాగర్‌కర్నూల్‌లో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

- నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి

- నాగర్‌కర్నూల్‌లో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, నవంబరు 25 (ఆంధ్ర జ్యోతి) : రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి ఇందిర మ్మ కుటుంబ బీమాతో భరోసా కల్పించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయమని నాగర్‌కర్నూల్‌ ఎ మ్మెల్యే డాక్టర్‌ కూచకళ్లు రాజేష్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్‌ రాం భవన్‌లో ఇందిరమ్మ కుటుంబ బీమా పథ కాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతీ ఒక్కరికీ చేరేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భద్ర త, భరోసా కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టి న ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు స ద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమం లో మునిసిపల్‌ చైర్మన్‌ తీ గల సునేంద్ర, వైస్‌ చైర్మన్‌ బాదం రమేష్‌, మునిసి పల్‌ కమిషనర్‌ నాగిరెడ్డి, కౌన్సిలర్లు గౌసియా బేగం, నిజాం, పడిగె శంకర్‌, పద్మ మ్మ, సింధు, చంద్రకళ తది తరులు పాల్గొన్నారు.

అయ్యప్ప స్వామి పడి పూజలో ...

తాడూరు, (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రం లోని కొమ్ముగుట్ట అయ్యప్పస్వామి దేవాలయం లో బుధవారం మహా పడి పూజ కార్యక్రమం అ త్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి హాజరు కాగా ఆలయ అర్చకులు ఆ యనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అ నంతరం అయ్యప్ప నామస్మరణతో కొమ్ము గుట్ట మారుమోగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ సమా జంలో వ్యక్తిగత జీవితాల్లో ఉండే పనులతో పాటు ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, అలా కలిగిఉంటేనే మానసిక ప్ర శాంతత లభిస్తుందన్నారు. కార్యక్రమంలో అర్చ కులు, సర్పంచ్‌ మల్లయ్యతో పాటు కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకులు, ఆయా గ్రామాల స ర్పంచ్‌లు, వివిధ గ్రామాలకు చెందిన అయ్యప్ప స్వాములు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2026 | 11:42 PM