Supreme Court: సుప్రీంకోర్టు నిర్ణయం కాంగ్రెస్‌కు చెంపపెట్టు
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:38 AM
ఫోన్ ట్యాపింగ్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం కాంగ్రె్‌సకు చెంపపెట్టు వంటిదని బీఆర్‌ఎస్ నేతలు పేర్కొన్నారు
హరీశ్‌పై నిరాధార ఆరోపణలు
బీఆర్‌ఎస్ నేతలు
హైదరాబాద్, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ఫోన్ ట్యాపింగ్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం కాంగ్రె్‌సకు చెంపపెట్టు వంటిదని బీఆర్‌ఎస్ నేతలు పేర్కొన్నారు. మాజీమంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్, బీఆర్‌ఎస్ నేతలు దేవిప్రసాద్, పల్లె రవికుమార్‌గౌడ్ తెలంగాణ భవన్‌లో సోమవారం వేర్వేరుగా మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అంటూ హరీశ్‌రావుపై నిరాధార ఆరోపణలు చేసినట్లు న్యాయస్థానంలో వెల్లడైందన్నారు. ఇదే అంశంలో హరీశ్ రావుపై గతంలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు ‘క్వాష్’ చేసిందని, దీంతో కాంగ్రెస్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్పీ) దాఖలు చేసిందని వారు తెలిపారు. దీనిపై విచారణలో భాగంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని చెబుతూ సుప్రీంకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసిందన్నారు. బీఆర్‌ఎస్ నాయకులను బద్నాం చేసేందుకు, తప్పుడు కేసుల్లో ఇరికిస్తూ.. కాంగ్రెస్ కుట్రలకు పాల్పడుతోందని, కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందన్నారు.