ఆ వివాదాన్ని మూడు నెలల్లో తేల్చండి
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:38 AM
ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్‌పమెంట్ అథారిటీ, సైబరాబాద్ ఎక్స్‌ప్రె్‌సవే సంస్థ మధ్య ఏళ్ల తరబడి సాగుతున్న వివాదాన్ని...
హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవల్‌పమెంట్ అథారిటీ, సైబరాబాద్ ఎక్స్‌ప్రె్‌సవే సంస్థ మధ్య ఏళ్ల తరబడి సాగుతున్న వివాదాన్ని మూడు నెలల్లో తేల్చాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఓఆర్‌ఆర్‌లో భాగంగా కొల్లూరు నుంచి పటాన్‌చెరు వరకు 8 లేన్ల ఎక్స్‌ప్రె్‌సవే నిర్మాణానికి సంబంధించిన బకాయిలపై వివాదం నెలకొంది. 2019లో ఒక ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ సైబరాబాద్ ఎక్స్‌ప్రె్‌సవేకు అనుకూలంగా తీర్పునిచ్చింది. రూ.140.89 కోట్లు క్లెయిమ్స్, రూ.39.50కోట్ల బోనస్‌యాన్యుటీతోపాటు 12శాతం వడ్డీ చెల్లించాలని హెచ్‌ఎండీఏను ఆదేశించింది. దీనిపై హెచ్‌ఎండీఏ హైకోర్టును ఆశ్రయించగా.. ట్రైబ్యునల్ తీర్పునే సమర్థించింది.హైకోర్టు తీర్పును హెచ్‌ఎండీఏ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆ పిటిషన్‌ను గురువారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పంచోలితో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. అభ్యంతరాలను పరిశీలించి 3 నెలల్లోగా కేసును పరిష్కరించాలని హైకోర్టును ఆదేశించింది.