మద్దతు అంతంతే...
ABN , Publish Date - May 16 , 2026 | 11:43 PM
ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధర చెల్లించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. 2026 వానాకాలం సాగు కోసం వివిధ రకాల పంటల కు మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రక టించింది.
-పంటలకు ధర ఖరారు చేసిన కేంధ్రం
-వరికి రూ. 72, పత్తికి రూ. 557
-ఎమ్మెస్పీపై పెదవి విరుస్తున్న రైతులు
-ఆకాశాన్నంటుతున్న సాగు ఖర్చులు
మంచిర్యాల, మే 16 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధర చెల్లించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. 2026 వానాకాలం సాగు కోసం వివిధ రకాల పంటల కు మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రక టించింది. అయితే పెరిగిన సాగు వ్యయంతో పోల్చితే ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్‌పీ (మినిమమ్ సపోర్ట్ ప్రైస్) ఏ మాత్రం సరిపోదనే అభిప్రాయాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు ప్రతి యేటా సా గు ఖర్చులు పెరుగుతున్నా, ప్రభుత్వం అందుకు అ నుగుణంగా కనీస మద్దతు ధర చెల్లించడం లేదు. దీం తో రైతులు తీవ్ర నిరాశ నిస్ప్రహలకు గురవుతున్నారు.
కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు...
ఈ ఏడాది వివిధ రకాల పంటలకు కేంద్రం ప్రక టించిన కనీస మద్దతు ధరలు ఇలా ఉన్నాయి. వరి కామన్ గ్రేడ్ (క్వింటాలుకు) కు రూ. 2441, గేడ్ర్-ఏకు రూ. 2461, పత్తి మధ్యరకం రూ. 8267, పొడవు పిందె కు రూ. 8667 ప్రకటించింది. గత ఏడాది వరికి రూ. 2369 ఉండగా, పత్తికి రూ. 7710 మద్దతు ధర ప్రక టించింది. గత ఏడాదితో పోల్చితే స్వల్పంగా ఎంఎస్‌పీ పెంచడంతో రైతులు పెదవి విరుస్తున్నారు. ఈ ఏడాది కేంధ్రం ప్రకటించిన విధంగా వరికి రూ. 72, పత్తికి రూ. 557 మాత్రమే మద్దతు ధరలు పెరిగాయి. ఈ ఏ డాది వివిధ రకాల పంటలకు కేంద్రం ప్రకటించిన వి ధంగా మద్దతు ధరలు ఇలా ఉన్నాయి. జొన్న హైబ్రి డ్ రకం ధర రూ. 4023కు పెంచగా గత ఏడాదితో పో ల్చితే రూ. 324 అధనంగా పెరిగింది. జొన్న మా ల్దండి రకం రూ. 4073 ఉండగా, గత ఏడాది కంటే రూ. 324 పెంచారు రాగుల ధర రూ. 5205 ఉండగా గతేడాది కంటే రూ.319 పెరిగింది. మొక్కజొన్న రూ. 2410 ఉం డగా గతేడాదితో పోల్చితే కేవలం రూ. 10 మాత్రమే పెరిగింది. సజ్జలు రూ. 2900 ప్రకటించగా, దీనిపె రూ. 125 అదనంగా పెరిగింది. ఇక పప్పు దినుసులైన కంది రూ. 8450 ఉండగా, రూ. 450 అద నంగా పె రిగింది. పెసలు రూ. 8780 ఉండగా, దీనికి రూ. 12 అ దనంగా పెంచారు. శనగలు రూ. 8200 ఉండగా, రూ. 400 అదనంగా పెరిగింది. అలాగే నూనె దిను సులైన పల్లి రూ. 7517 ఉండగా, దీనికి రూ. 254 అదనంగా పెంచారు. సన్‌ఫ్లవర్ రూ. 8343 ఉండగా, దీనికి రూ. 622, సోయాబీన్ రూ. 5708 ఉండగా, దీనికి రూ. 380, నువ్వులు రూ. 10,346 ఉండగా, దీనిపై రూ. 500, నల్ల నువ్వులు రూ. 10,052 ఉండగా రూ. 515 పెంచారు.
యేటా పెరుగుతున్న ఖర్చులు...
పంటల సాగుకు ప్రతి యేటా ఖర్చులు పెరుగుతు న్నాయని రైతులు వాపోతున్నారు. జిల్లాలో వానాకా లం సీజన్‌లో 3 లక్షల 33వేల 430 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. దుక్కి దున్నింది మొదలు, నాట్లు వేయడం, కలుపు పనులు చేపట్టాల్సి ఉంది. ఇందుకు గాను ట్రాక్టర్ కిరా యిలు, కూలీలు, విత్తనాల రేట్లు ప్రస్తుతం ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసు కుంటేగానీ పంటలు పండటం లేదు. ఎకరాకు సగ టున రూ. 30 వేల నుంచి రూ. 40వేల వరకు ఖ ర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. ఈ లెక్కన ప్రభు త్వం ప్రకటించిన మద్దతు ధర ఏ మాత్రం సరి పోదని పేర్కొంటున్నారు. ఎకరా పత్తి సాగు చేస్తే ఏడు క్విం టాళ్ల దిగుబడి వస్తుంది. క్వింటాకు రూ. 8267 చొప్పు న మొత్తం రూ. 57,869 మాత్రమే గిట్టుబాటు అవు తుంది. అందులో పెట్టుబడి రూ. 40 వేలు పోను మి గిలేది రూ. 17 వేల పైచిలుకు మాత్రమే. అందులో పంటను తరలించడానికి కూలీలు, ఇతర ఖర్చులు పో ను చేతికి వచ్చేది అంతంత మాత్రమే. పెరుగు తున్న ఖర్చులను అంచనా వేయకుండానే కేంధ్రం వివిధ పం టలకు మద్దతు ధర ప్రకటించడం సమంజసం కాదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కేంద్రం నిర్ణయంతో రెక్కల కష్టం కూడా మిగిలే పరిస్థితి లేదని వాపోతున్నారు.
ఏ మూలకు సరిపోవు...
లగిశెట్టి రాజమౌళి, గుడిపేట రైతు
వరి, పత్తి పంటలకు కేంధ్రం ప్రకటించిన మద్దతు ధరలు ఏ మూలకు సరిపోవు. పంట సాగు చేసింది మొదలు కొనుగోలు కేంద్రాలకు తరలించే వరకు కూలీ లు, ఇతర ఖర్చులు ఉంటాయి. అవన్నీ పోను మిగిలేది ఏమీ ఉండదు. పైగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగితే నిలువునా మునిగిపోవడమే త ప్ప, ఒరిగేదీ ఏమీ ఉండదు. ఎరువులపై బస్తాకు రూ. 300 పెంచిన ప్రభుత్వం వరికి రూ. 70 పెంచడం స మంజసం కాదు. ప్రభుత్వం పత్తికి రూ. పది వేలు, వరికి రూ. 3000 వేల చొప్పున మద్దతు ధరలు చెల్లించాలి.