మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు చేయూత
ABN , Publish Date - Jun 30 , 2026 | 11:07 PM
రాష్ట్రంలోని మహిళలు ఆర్ధికంగా ఎదిగేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనిస్తుందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు.
-మంత్రి వివేక్‌వెంకటస్వామి
జైపూర్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని మహిళలు ఆర్ధికంగా ఎదిగేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయూతనిస్తుందని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని గంగి పల్లి గ్రామంలో గ్రామైక్య సంఘం భవనం, ఇందిరమ్మ ఇంటిని కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళ శక్తి పథకం ద్వారా మహిళలు ఆర్ధికంగా అభివృద్ధి చెందేందుకు చేయూతనందించి ప్రోత్సహిస్తుందన్నారు. గ్రామంలో రూ. 15 లక్షల డీఎంఎఫ్‌టీ 2022-23 సంవ త్సరం నిధులతో గ్రామైక్య సంఘం భవనం ప్రారంభించామన్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారుల సమన్వయంతో కృషి చేస్తున్నామన్నారు. అ నంతరం విశాఖ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కు స్కూల్ బ్యాగ్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వనజారెడ్డి, ఎంపీడీవో సత్యనారాయణ, పార్టీ మండల అధ్యక్షుడు విశ్వంభర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేయవద్దు
ప్రభుత్వం చేపట్టిన సర్ ప్రక్రియను నిర్లక్ష్యం చేయవద్దని, ప్రతి పౌరునికి ఓటు పరిరక్షణ కోసం కృషి చేయాలని మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొ న్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో బీఎల్‌ఏ2లతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరికి కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు హక్కు కల్పించేలా నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు విశ్వంభర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, సర్పంచు ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.